‘సరిలేరునీకెవ్వరు’ మూవీ మ్యానియా  మరింత పెంచడానికి మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలసి మహేష్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను లీక్ చేస్తున్నాడు. ఇదే సందర్భంలో ఈసినిమాలో నటించిన రష్మిక గురించి మహేష్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

మూవీ షూటింగ్ సమయంలో రష్మికతో నటిస్తున్నప్పుడు తాను పడ్డ పాట్లను వవ్వుతూ వివరిస్తూ అసలు ఆమెను తన సినిమాలో ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడ్డ సంఘటనలు కూడ ఉన్నాయి అంటూ కొన్ని ఆశ్చర్యకర విషయాలు చెప్పాడు. ప్రతిరోజు జరిగే షూటింగ్ స్పాట్ కు ఉదయాన్నే చాల ఉత్సాహంగా వచ్చే రష్మిక దూకుడు చూసి ఆమె ఉత్సాహంతో సరిసమానంగా నటించగలనా అని భయపడ్డ సందర్భాలు ఉన్న విషయాన్నీ గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే షూటింగ్ లో మధ్యాహ్నం అయ్యేసరికి ఆమె మూడిగా మారిపోవడంతో షూటింగ్ నడిచేది కాదనీ దీనితో ఆమె టేకులు ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో అసలు ఈ మూవీ సంక్రాంతికి విడుదల అవుతుందా అన్న భయాలు తనకు అనేకసార్లు కలిగిన విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. అయితే రష్మిక ఇలా మూడీగా మారిపోవడానికి గల కారణం తెలుసుకుని తాను ఆతరువాత షాక్ అయిన విషయాన్ని వివరిస్తూ రష్మిక లోని బలహీనతలను బయటపెట్టాడు. 

రష్మిక విపరీతంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గాసిప్పులను తెగ చూస్తుందట. ఉదయం పూట ఉత్సాహంగా షూటింగ్ స్పాట్ కు వచ్చిన రష్మిక ఆతరువాత వచ్చే బ్రేక్ సమయంలో సోషల్ మీడియా న్యూస్ లు తన పై వచ్చే గాసిప్పులు చదువుతూ మూడీగా మారిపోతుందట. ఈ విషయాలు దర్శకుడు అనీల్ రావిపూడి ద్వారా తెలుసుకున్న మహేష్ రష్మికకు షూటింగ్ స్పాట్ లో సెల్ చేతిలో పుచ్చుకుని సోషల్ మీడియా వార్తలు చదివితే తాను ఊరుకోను అంటూ బెదిరించాడట. దీనితో రష్మిక కొంతవరకు షూటింగ్ స్పాట్ లో కంట్రోల్ అయినా ఆమెకు ఉన్న ఈ బలహీనత ఎలా పోగొట్టాలో తెలియక చివరకు విజయశాంతి ద్వారా రష్మికకు క్లాస్ పీకించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ రష్మిక ది చాల చిన్నపిల్ల మనస్తత్వం అంటూ కామెంట్ చేసాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: