ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచేస్తూ... వరుస  పాటల విడుదల తో దుమ్ము రేపుతూ... హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కినది  ఈ సినిమా. ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ వచ్చింది. ఇక  సినిమా మ్యూజిక్ అయితే నేటి తరాన్ని మొత్తం ఊపేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరి నోట విన్నా అలా వైకుంటపురములో  పాట. అబ్బో సినీ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ప్రభావితం చేశాయి ఈ సినిమా పాటలు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కు  కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావడానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ పోటీ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను భారీగానే ఆకర్షించాల్సి  ఉంటుంది. 

 

 

 

 కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్,  శ్రేయాస్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులు మ్యూజిక్  కన్సర్ట్ ఈవెంట్  నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మ్యూజిక్ కన్సర్ట్  ఈవెంట్  అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్ కి   ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాలోని మ్యూజిక్ ఒక రేంజ్లో హిట్ అవ్వడంతో పాటు మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్  కూడా హిట్ అవడంతో చిత్రబృందం అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 

 

 

 

 ఇకపోతే ఈ మ్యూజిక్ కన్సర్ట్  నిర్వహించినందుకు గాను నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, శ్రేయాస్ మీడియా సంస్థలకు చిక్కులు వచ్చిపడ్డాయి. తప్పుడు సమాచారం ఇచ్చారనే  కారణంతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ శ్రేయాస్ మీడియా సంస్థలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల వైకుంఠ పురము లో సినిమాకు సంబంధించి జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్  నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని జూబ్లీహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాత్రి 10 గంటలకు ముగియాల్సిన  కార్యక్రమం 11:30 గంటల వరకు సాగిందని... అంతే కాకుండా కేవలం 6 వేల మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సి  ఉండగా ఏకంగా 15 వేల మందిని పైగా ఆహ్వానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎస్ఐ నవీన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: