రజినీకాంత్ దర్బార్ దేశాన్ని ప్రస్తుతం ఊపేస్తున్నది.  దర్బార్ ప్రీమియర్ షోలకు మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  చాలా కాలం తరువాత రజినీకాంత్ మంచి జబర్దస్త్ హిట్ అందుకున్నాడు.  సినిమా కోసం రజిని అంతగా కష్టపడతారు అని ఎవరూ ఊహించలేదు.  రజిని ఇచ్చిన అవకాశాన్ని మురుగదాస్ చక్కగా వినియోగించుకున్నారు.  సినిమాను భారీ స్థాయికి తీసుకెళ్లాడు. 


రజిని సినిమా హిట్ అయితే ఎలాంటి హంగామా కనిపిస్తుందో అలాంటి హంగామా ఈ సినిమా ద్వారా కనిపించింది.  సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.  ఇప్పటికే సినిమాకు మంచి రేటింగ్ వస్తున్నది.  రజినీకాంత్ యాక్షన్ సూపర్ అంటున్నారు.  70 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ రొమాంటిక్ యాక్షన్ అదిరిపోయిందని చెప్తున్నారు.  రజినీకాంత్ అదరరగొట్టారని, అంతకు మించేలా పనిచేశారని అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఫస్ట్ హాఫ్ లో రజిని కాంత్ హాస్యం, రొమాన్స్, లవ్ తో ప్రేక్షకులను మాయ చేశారు.  మాయ చేయడమే కాకుండా రొమాంటిక్ యాంగిల్ లో రజిని హంగామా సృష్టించారు.  ఇక సెకండ్ హాఫ్ లో రజిని యాక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  ఓ హత్య కేసును రజినీకాంత్ ఎలా చాలెంజింగ్ గా తీసుకున్నారు.  ఎలా దానిని నడిపించారు.  ఎలాంటి అద్భుతాలు చేశారు అన్నది సినిమాలో పక్కాగా చూపించారు.  


ఇకపోతే,సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచిందని ప్రతి ఒక్కరు అంటున్నారు.  ఇదే విషయాన్ని రజినీకాంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో కథ ఏమి ఉండదు.  ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు.  కానీ, సినిమాను నడిపించిన విధానం ఓ మ్యాజిక్ చేస్తుంది.  ఆ మ్యాజిక్ అన్ని సినిమాలకు వర్కౌట్ కాదు.  కానీ, ఈ సినిమాకు అది పక్కాగా వర్కౌట్ కావడంతో థియేటర్లలో రజిని మానియా ఒక్కసారిగా మొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: