రజినీకాంత్ దర్బార్ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నది.  సినిమా విజయం సాధించింది అంటే అది రజినిగొప్పతనం కాదు.  మురుగదాస్ స్క్రీన్ ప్లే తో చేసిన మ్యాజిక్ అని చెప్పాలి.  కథ పరంగా చూసుకుంటే రొటీన్ గానే కనిపిస్తుంది.  రివెంజ్ డ్రామా.  అయితే ఇక్కడ ఓ వ్యక్తి కాదు... ఓ వ్యవస్థ రివెంజ్ డ్రామా.  ఇలాంటి మూస కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.  మాములుగా చెప్పాలి అంటే దర్బార్ కూడా అలాంటి సినిమానే.  కానీ, మురుగదాస్ ఈ సినిమాలో ఓ మ్యాజిక్ చేశారు.  


అదే సినిమాను నిలబెట్టింది.  అద్భుతాలు చేయిస్తోంది.  సినిమాను హిట్ టాక్ కు తీసుకెళ్లింది.  స్క్రీన్ ప్లే పై పెట్టిన దృష్టి కొద్దిగా కథపై కూడా మురుగదాస్ పెట్టి ఉన్నట్టయితే సినిమా మరో రేంజ్ లో ఉండేది.  ఎక్కడా కూడా తగ్గేది కాదు.  మరో రేంజ్ లో దూసుకుపోయేది.  ఎన్నో ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం రజినీకాంత్ ఎదురు చూస్తున్నారు.  ఎలాంటి హిట్ కావాలి అనుకున్నారో అది వచ్చేసింది.  


మాస్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ కు హిట్ సినిమా పడితే ఎలా ఉంటుందో తెలుసా... సునామి వచ్చినపులు సముద్రం ఎలా పోటెత్తుతుందో కలెక్షన్ల సునామి అలా పోటెత్తుతోంది.  అందులో సందేహం అవసరం లేదు.  సునామీలా ఈ సినిమా దూసుకుపోవడం ఖాయం అని చెప్పాలి.  దేశంలోనే కాదు ప్రపంచంలో రజినీకి అభిమానులు ఉన్నారు.  అమెరికా, జపాన్, మలేషియా,  ఇండోనేషియా, కొరియా వంటి దేశాల్లో రజినీకాంత్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు.  


ఇప్పుడు అక్కడ పండగ వాతావరణం నెలకొన్నది.  అలానే యూఎస్ బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ సందడి చేస్తున్నది.  ప్రీమియర్స్ ద్వారానే సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.  అటు దుబాయ్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  అయితే, మురగదాస్ కొద్దిగా కథలపై కూడా దృష్టిపెడితే బాగుండేది.  సినిమా మరో విధంగా ఉండేది.  ఎంత బిజీ అయినప్పటికీ మురుగదాస్ కథల పై కూడా దృష్టి పెట్టాలి.  తమిళ్ హీరోలకు మంచి హిట్స్ ఇస్తున్న మురుగదాస్ తెలుగు హీరోల విషయంలోనే వెనకబడిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: