సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం దర్బార్. తలైవా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న  దర్బార్ సంక్రాంతి కానుక‌గా రానే వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమా ఈరోజు థియేటర్లో సందడి చేస్తున్నది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోలు కూడా ముగిశాయి. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో రజిని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

 

ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. ఇక సినిమాపై రజిని అభిమానులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, పాత రజినీకాంత్ ను చూపించారని అంటున్నారు.  రజినీకాంత్ సినిమా ఎలా ఉండాలని ప్రతి అభిమాని కోరుకున్నాడో ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు.  సినిమాకు రేసి స్క్రీన్ ప్లే సూపర్ సక్సెస్ అయ్యినట్టు తెలుస్తోంది. మురుగదాస్ సినిమాను సూపర్ స్టైలిష్ గా, తుపాకీ రేంజ్ లో తీశారని అంటున్నారు కొంద‌రు. ఇక అందరికంటే ముందు సంక్రాంతిని మొదలు పెట్టిన రజనీ.. తన మాస్ యాక్షన్‌తో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరిస్తున్నాడు. 

 

సినిమా ఫారిన్‌లో ఇప్పటికే విడుదలైంది. సినిమా గురించి ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టరీలు దర్బార్ సినిమా ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తమదైన శైలిలో మంచి రేటింగ్ ఇస్తూ సూపర్ స్టార్ ఖాతాలో మరో భారీ హిట్ పడిపోయినట్లేనంటున్నారు. 2010లో వ‌చ్చిన రోబో త‌ర్వాత ర‌జ‌నీకి హిట్ లేదు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో ఆ క‌ల తీరింద‌ని చెప్పాలి. అలాగే సినిమా చాలా అద్భుతంగా ఉందని, రజనీ మరోసారి మ్యాజిక్ చేశారని, చిత్రం సూపర్ హిట్ అని తాజా టాక్. మ‌రి ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ పరంగా ముందు ముందు ఎలా సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: