సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వీర అభిమానులు ఉన్నారు రజినీకాంత్ కి . అయితే రజనీకాంత్ ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సినిమాలు తీస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తనదైన స్టైల్ యాక్టింగ్ తో  సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రజినీకాంత్. అయితే గత కొంతకాలంగా రజినీకాంత్ విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఏకంగా భారీ బడ్జెట్ సినిమాతో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రోబో 2.0 సినిమా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రజనీకాంత్ అభిమానులు అందరూ సతమతమవుతున్నారు. మా అభిమాన హీరోకు హిట్  పడేది ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

 

 ఇక రజనీకాంత్ కు వీరాభిమానులు ఎక్కువ కాబట్టి... రజనీకాంత్ సినిమా హిట్ కావాలని అభిమానులు చేయని ప్రయత్నాలు ఉండవు. ఏకంగా దేవుళ్ళ దగ్గర ఉపవాసాలు ఉండటం లాంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని చేసినా గత కొంతకాలంగా రజినీకాంత్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. దీంతో రజనీ అభిమానులు అందరూ అయోమయంలో పడిపోయారు. దాదాపు గత పదేళ్ల నుంచి రజనీకాంత్ కు ఆయన స్థాయిలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ఎన్నో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో రజనీ అభిమానులందరికీ గత పదేళ్లు ఓ పీడకల మారిపోయింది. తమ అభిమాన హీరో సినిమా హిట్టు కావాలని రజనీ అభిమానులు మొక్కని దేవుడు లేడు.

 

 

 

 ఇక గత పదేళ్ల నుంచి ఇన్నాళ్ళకు దర్బార్ సినిమాతో రజనీకాంత్ ఫ్యాన్స్ పీడకల తీరిపోయింది. తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు అద్భుత హిట్ సాధిస్తారా  అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్న అభిమానులందరికీ కల నెరవేరింది. దర్బార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రొటీన్ కథతోనే రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ... దర్శకుడు మురుగదాస్ సినిమాను మలిచిన తీరు సినీ ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది. రజనీకాంత్ స్టైల్ యాక్టింగ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటూ దర్శకుడు మురుగదాస్ దర్బార్ సినిమాలో మాయ చేసాడు. అంతే కాకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటించడంతో ప్రేక్షకులను మరింత ఆనంద పడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రజనీకాంత్ విలన్ సునీల్ శెట్టి మధ్య  జరిగే ఎత్తులు పైఎత్తులు సినీ ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తాయి. ఏదేమైనా దర్బార్ సినిమాతో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అంతే అంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: