రజినీకాంత్ దర్బార్ థియేటర్లో ఓ హంగామా చేస్తున్నది.  సినిమాపై వచ్చిన అంచనాలను నిలుపుకుంటూ సందడి చేస్తున్నది.  సినిమా ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడం, సినిమాకు రజిని యాక్షన్ ప్లస్ కావడంతో పాటుగా ఇందులో బర్నింగ్ విషయాలు తీసుకొని మురుగదాస్ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ సినిమాను నిలబెట్టింది.  హిట్ టాక్ దిశగా తీసుకెళ్లింది.  కబాలి వంటి ప్లాప్ అయిన సినిమాలే వందల కోట్లు వసూళ్లు చేశాయి.  


ఇక సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే చెప్పాల్సింది ఏముంటుంది.  70 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ చిన్న కుర్రాడిలా రెచ్చిపోయి సినిమా చేశారు.  తన మ్యానరిజం, మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.  ఇవే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.  సినిమాపై నమ్మకాన్ని పెంచాయి.  సూపర్ టాక్ వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి వసూళ్లపైనే ఉన్నది.  


రజిని వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అని ఎదురు చూస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ కావడంతో బాలీవుడ్ లో కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  ఈ సినిమాపై అంచనాలు పెంచింది.  ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లు ఎలా ఉంటాయో అని ఎదురు చూస్తున్నారు.  కనీసం ఫస్ట్ డే రోజున రూ. 100 కోట్ల వరకు కలెక్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.  వేలాది థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యింది.  ఒక్క హైదరాబాద్ లోనే 771 షోలు వేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఒక్క హైదరాబాద్ ఈ పరిస్థితి ఉంటె తమిళనాడులో ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  అటు బెంగళూరులో రజినీకి అభిమానులు తారాస్థాయిలో ఉంటారు.  ముంబైలోనే అదే సందడి.  

 


లక్నోలో చెప్పాల్సిన అవసరం లేదు.  విదేశాల్లోనూ అదే విధంగా ఉన్నారు.  సో, మొదటిరోజు వసూళ్ల బట్టి సినిమా ఉంటుంది.  వందకోట్ల పనే వస్తాయని కొందరి వాదన.  ఇప్పటికే టికెట్స్ దొరక్క పాపం ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.  శివ మాస్ దర్శకుడు.  అజిత్ కు వరసగా నాలుగు మాస్ హిట్స్ ఇచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: