నవ్వుల నవాబు నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికీ విదితమే, అయితే అతడు జీటీవీ లోకి మకాం మార్చి ఏడేళ్లుగా తనని పోషించిన అమ్మలాంటి జబర్దస్త్ షో ని విమర్శించడం కూడా జరిగాయి. దాంతో, చిర్రెత్తి పోయిన ఈటీవీ యాజమాన్యం మెగాబ్రదర్ నాగబాబు కు షాకుల మీద షాకులు ఇస్తుంది. మొదట జబర్దస్త్ హాస్యనటులు అందరిని లాక్కెళ్ళి పోయిన నాగబాబుకి, ఇంకా వెళ్లిపోయిన హాస్యనటుల కి కాంట్రాక్టు అనే ఒక ఒప్పందంతో భయపెట్టి మళ్లీ తమ షో కు తీసుకుని వచ్చింది ఈటీవీ యాజమాన్యం. ఇకపోతే జీ తెలుగులో ప్రసారం అయ్యే అన్ని కార్యక్రమాలు ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమానికి ఏ మాత్రం పోటీ ఇవ్వడం లేదు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అదిరింది షోలు కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి.


దీనికి తోడు ఈటీవీ తీసుకున్న నిర్ణయాలు అనగా అదిరింది షో ప్రసారం అయ్యే టైం లోనే జబర్దస్త్ స్కిట్లు ప్రసారం చేయడంతో అదిరింది షో కంటే జబర్దస్త్ ఎడిటింగ్ స్కిట్ లు చాలా బాగున్నాయి అనే టాక్ బలంగా వినపడుతుంది. కేవలం అది మాత్రమే కాదు.. రేటింగ్ పరంగా చూసుకున్నా.. పాత జబర్దస్త్ స్కిట్లకు 5 రేటింగ్ వస్తే.. కొత్తగా వచ్చిన అదిరింది షోకు మాత్రం కేవలం మూడు రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో పాత జబర్దస్త్ స్కిట్లు కంటే కొత్త స్కిట్ లతో ప్రసారమయ్యే అదిరింది షో బాగోలేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి నాగబాబు జబర్దస్త్ షో కి పది లక్షలు తీసుకొనగా... జీటీవీ మాత్రం ఏకంగా రూ.20 లక్షల పెట్టుకొని మరీ తెచ్చుకుంది.


కానీ నాగబాబు వేసే వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు ఏమాత్రం జీటీవీ కి సానుకూలంగా మారడం లేదు. జబర్దస్త్ లాంటి అదిరింది కామెడీ షో ప్రారంభమై ఏకంగా నాలుగు వారాలు అవుతున్నప్పటికీ.. రేటింగ్ ల పరంగా ఎటువంటి ప్రోగ్రెసివ్ నెస్ లేదు. దాంతో దానికి అన్ని బాధ్యతలు వహించే నాగబాబు ఏం చేయాలో తెలియక చివరికి అదిరింది షో నుంచి
.కాదు!!కాదు!! మొత్తం జీ తెలుగు ఛానల్ నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. అలా బయటకి వచ్చి తమ్ముడు పార్టీ జనసేన కోసం సమయం వెచ్చించాలని నాగబాబు నిశ్చయించుకున్నట్లు సమాచారం. అయితే.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. ఇంతకుముందు నాగబాబు ని నమ్మి అతనితోపాటు వచ్చేసిన కొంతమంది ప్రముఖ కమెడియన్లు చుక్కల చూడడం ఖాయమని చెప్పకనే చెబుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: