కొంతకాలం క్రితం వరకు సంక్రాంతి రేస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి వరస ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీ వర్గాలలో తన క్రేజ్ ను పోగొట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో తమిళ మూవీ ‘96’ రీమేక్ గా రాబోతున్న ‘జాను’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.

సినిమా టైటిల్ ను ఖరార్ చేస్తూ ఈ మూవీ నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ విడుదలై రెండు రోజులు కూడ పూర్తి కాకుండానే ఈ ఫస్ట్ లుక్ పై సమంత అభిమానుల నుండి వస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేక శర్వానంద్ తలపట్టుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో ఒక ఎడారి ప్రాంతంలో ఒంటెలు వరసగా వెళ్ళిపోతుంటే వాటి వెనుక నడుస్తున్న శర్వానంద్ లుక్ తో పోస్టర్ ను డిజైన్ చేసారు.

ఇప్పుడు ఈ విషయం సమంత అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఈ మూవీలో సమంత పాత్ర అత్యంత కీలకం కావడంతో ఈ మూవీకి ‘జాను’ అనే టైటిల్ పెట్టి ఆమె పాత్రను హైలెట్ చేస్తుంటే శర్వానంద్ లుక్ తో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎందుకు ముందుగా వదిలారు అంటూ సమంత అభిమానులు ప్రశ్నించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సమంత పాత్ర లుక్ కనిపించక పోవడం ఆమెకు జరిగిన అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘96’ను తమిళ వెర్షన్ ను అద్భుతంగా మలచిన ప్రేమ్ కుమార్మూవీ తెలుగు రీమేక్ లో చాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ‘జాను’ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా దర్శకుడు ఏదో కన్వే చేయాలనుకుంటున్నాడని త్వరలోనే సమంత లుక్ రిలీజ్ చేస్తాడని అంటున్నారు. ఇక తమిళంతో పోలిస్తే ఈ మూవీకి సంబంధించిన తెలుగు కథలో చాల మార్పులు జరగడంతో సమంత తో సమానంగా శర్వానంద్ పాత్రను కూడ పెంచినట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: