మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన దర్బార్ సినిమా ఈరోజు విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో విడుదలకు ముందు ఏ మాత్రం ఆసక్తి క్రియేట్ చేయలేకపోయిన దర్బార్ సినిమాకు హిట్ టాక్ రావడంతో 2020 సంవత్సరంలో తొలి హిట్ గా దర్బార్ నిలిచింది.
 
దర్బార్ సినిమాకు ముఖ్యంగా రజనీకాంత్ అదిరిపోయే నటన, కొన్ని ఎలివేషన్ సీన్లు హైలెట్ అయ్యాయి. ఏడు పదుల వయస్సులో కూడా రజనీ కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా అధ్బుతంగా నటించాడని అభిప్రాయాలు ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు మురుగదాస్ రేసీ స్క్రీన్ ప్లేతో అలరించాడని సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు లేవని రజనీ - మురుగదాస్ కాంబో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో కట్టిపడేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు. 
 
రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైట్లు, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్, నివేదా థామస్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని ఈ మధ్య కాలంలో రజనీకాంత్ నటించిన సినిమాల్లో దర్బార్ బెస్ట్ సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ తన ఇమేజ్ కు తగిన కథలో నటించాడని రజనీకాంత్, నయనతార మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని ప్రేక్షకులు చెబుతున్నారు. 
 
స్టైలిష్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ ఫ్యాన్స్ ను మెప్పించాడు. రజనీ ఫ్యాన్స్ రజనీకాంత్ నుండి ఏం కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా మురుగదాస్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దర్బార్ సినిమా రజనీ వన్ మేన్ షో అని చెప్పవచ్చు. రోబో తరువాత సరైన హిట్ లేని రజనీకాంత్ దర్బార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి పండుగకు మంచి మాస్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు దర్బార్ మంచి ఆప్షన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: