సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌నకు కేవ‌లం త‌మిళ‌నాట మాత్ర‌మే కాక తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. ర‌జ‌నీ స్టైల్ కోస‌మే చాలా మంది ర‌జ‌నీ సినిమాలు చూడడానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఎంత వ‌య‌సు వ‌చ్చినా స్టైల్ మాత్రం ఆయ‌న ఏమాత్రం త‌గ్గించ‌లేదు. ఇక పోతే గ‌త మూడు నాలుగు సంవ‌త్స‌రాల నుంచి మాత్రం ఆయ‌న చేసిన సినిమాలు పెద్ద‌గా ఆకట్టుకోవ‌డంలేదు. అవి క‌థ క‌థనాలు స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డంతో ర‌జ‌నీకి దాదాపుగా అన్నీ ఫ్లాపులే వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేఎస్‌.ర‌వికుమార్ అవుట్ డేటెడ్ క‌థ‌ల‌తో ఆయ‌న ముందుకు వ‌చ్చాడు.  కాలా,  అదే విధంగా క‌బాలీ ద‌ర్శ‌కుడు కూడా కొత్తవాడు.. స‌రైన ద‌ర్శ‌కుడు ఎంచుకోకపోవ‌డం కాస్త లోప‌మ‌నే చెప్పాలి.  ఎన్నో ఆశ‌లు పెట్టుకుని హై బ‌డ్జెట్‌తో తెరకెక్కిన శంక‌ర్  2.0 కూడా ఫ్యాన్స్‌కి నిరాశ మిగిల్చింది.  ఇన్నేళ్ళ‌కు మ‌ళ్ళీ ర‌జ‌నీని మురుగుదాస్ ట్రాక్ ఎక్కించాడు. 

 

చాలా కాలం గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీ ఫ్యాన్స్ ద‌ర్బార్ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందులో క‌థ క‌థ‌నాలు అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. దానికి తోడు ర‌జ‌నీ ఒన్‌మ్యాన్ షో అదిరిపోయింద‌నే చెప్పాలి. న‌య‌న్ ర‌జ‌నీల మ‌ధ్య వ‌చ్చిన రొమాంటిక్ సీన్స్ అదిరాయి.  మలయాళ బ్యూటీ నివేదా థామస్ దర్బార్ చిత్రంలో ఓ కీలక పాత్ర‌లో పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. చెన్నైలో రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ దర్బార్ నమోదు చేసింది. మొత్తానికి ఈ చిత్రంలో తిరిగి ఆయ‌న స‌త్తా చూపించారు. రామ్‌ల‌క్ష్మ‌ణ్‌ల ఫైట్స్ ఈ చిత్రంలో హైలెట్ అని చెప్పాలి.  త‌మిళంలో మొద‌టిసారి ర‌జ‌నీకాంత్ వాళ్ళ‌కు ఫైట్స్ కంపోజ్ చేసే అవ‌కాశం ఇచ్చ‌న‌ట్లు ఇటీవ‌లె జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని v PRASAD' target='_blank' title='ఎన్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎన్ వి ప్రసాద్ విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: