భారత దేశ సినీ పరిశ్రమంలో సూపర్ స్టార్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన నటుడు రజినీకాంత్.  తెలుగు, హిందీ, తమిళ, మళియాళ, మరాఠీ ఒక్క భాష కాదు అన్ని భాషల్లో ఆయన నటించి మెప్పించారు.  అయితే రజినీ ఫైట్స్, నడక, కాలర్ ఎగరేయడం, సిగరేట్ గాల్లో తిప్పుతూ నోట్లో వేసుకోవడం.. స్లైల్ గా హెయిర్ స్టైల్ ని చేత్తో పైకి అనుకోవడం.. ఒక్కటేమిటి రజినీ నిలువెత్తు స్టైల్ కి నిదర్శనం అంటారు.  ఇప్పటికీ ఆయన వయసు 70 అయినా అప్ కమింగ్ హీరోలతో పోటీగా ఉంటారు.  కొత్త హీరోలకే సవాల్ విసురుతూ ఆయన నటనతో దుమ్మురేపుతున్నారు.  ఏ హీరోకైనా హిట్.. ఫ్లాప్ అనేవి ఉంటాయి. రజినీకాంత్ కి ఎంత మంచి పేరు ఉన్నా.. ఆయన నటించిన ‘లింగా’ మూవీ తెలుగు, తమిళంలో దారుణమైన డిజాస్టర్ అయ్యింది. 

 

మూవీ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున గొడవ చేయడం.. రజినీ వారికి సెటిల్ చేయడం జరిగిందని అంటారు.  ఆ తర్వాత ఎన్నో అంచనాల మద్య కబాలి, కాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి.  ఆ మూవీస్ కూడా పెద్దగా టాక్ రాకపోవడంతో రజినీ కెరీర్  ఇబ్బందులో పడుతున్న సమయంలో పెట్టా మూవీతో మంచి విజయం అందుకున్నారు.  ఈ మూవీ తర్వాత రజినీ టైమ్ మళ్లీ మొదలైందని అన్నారు.  ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న దర్భార్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో రజినీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

 

ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు..దాంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది.  ట్రైలర్ చివరల్లో ఐ యామ్ బ్యాడ్ కాప్ అని రజినీ డైలాగ్ చూస్తుంటే.. ఓ మాస్ పోలీస్ ఆఫీసర్ ఏ రేంజ్ లో ఊపుతాడో చూడాలని ఉత్సాహ పడుతున్నారు ఫ్యాన్స్. మొత్తానికి దర్భార్ లో రజినీ కుమ్మేస్తాడని ఫ్యాన్స్ పక్క చెప్పేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: