‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి మహేష్ ఒక్క రూపాయి కూడ పారితోషికంగా తీసుకోలేదు అంటూ ఓపెన్ గానే చిరంజీవిమూవీ ఫంక్షన్ లో చెప్పి మహేష్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే మహేష్ పారితోషికం తీసుకోకుండా ఈ మూవీలో నటించడం వెనుక ఆశలు విషయాలు తెలుసుకుని ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో నటించడానికి మహేష్ ఒప్పుకునే ముందు తన పారితోషికంగా ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే అడిగినట్లు టాక్. అయితే ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కు ఏర్పడిన మ్యానియా రీత్యా ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకం ద్వారా మహేష్ కు 55 కోట్లు వరకు ముట్టింది అని అంటున్నారు. 

అంతేకాదు ఈ సినిమా అనుకున్న విధంగా ఘన విజయం సాధిస్తే  సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ పై వచ్చే లాభాల్లో 30% శాతం కూడా మహేష్ అడిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేష్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మహేష్ కు ఏమాత్రం నష్టం ఉండదు. 

ఆ నష్టం భరించాల్సింది మాత్రం నిర్మాత దిల్ రాజ్ అనీల్ సుంకర లు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. దీనితో మెగా స్టార్ చిరంజీవి చెప్పినంత ఉదార స్వభావం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతల పై చూపించలేదు అంటూ మహేష్ తెలివితేటలకు ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ అమ్మకం విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఈ రెండు సినిమాల ఫైనల్ రిజల్ట్ వస్తే కాని క్లారిటీ వచ్చే అవకాసం ఉండదని  అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: