సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.. అందులో కొన్ని ఎవర్ గ్రీన్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి. అలాంటి మూవీస్ లో ‘భాషా’ ఒకటి.  ఈ మూవీలో రజినీ తన స్నేహితుడి పేరు తన పేరు గా మార్చుకొని పెద్ద మాఫియా సామ్రాజ్యానికి అదిపతి అవుతాడు.  అయితే తండ్రికి ఇచ్చిన మాటతో ఒక సామాన్య ఆటో డ్రైవర్ గా మారి తన కుటుంబాన్ని చూసుకుంటాడు.. ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో రజినీ నటనకు థియేటర్లో ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు.  భాషా 1995 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయ్యింది.    ఈ మూవీలో డైలాగ్   ‘బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అనేది బాగా పాపులర్ అయ్యింది.. ఇప్పటికీ ఈ డైలాగ్స్ ఫన్నీగా ఇప్పటికీ కొంత మంది వాడుతుంటారు. ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.

 

దేవా మ్యూజిక్ అందించారు. వి. రాజమ్మాల్, వి. తమిళ్ అఝగన్ నిర్మాతలు గా వ్యవహరించారు.  అయితే బాషా లాంటి మూవీ మరొక్కటి చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు. ఎందుకంటే భాషాలో కనీ వినీ ఎరుగని రీతిలో ఫైట్స్ కంపోజ్ చేశారు.  ఈ తరహా ఫైట్ సీన్లు ఇప్పడు రజినీ నటిస్తున్న ‘దర్భార్’ మూవీలో కనిపిస్తున్నాయి.  ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘దర్భార్’ లో కొన్ని ఫైట్ సీన్లు చూస్తుంటే.. భాషా గుర్తుకు వస్తుందని అంటున్నారు. 

 

ముఖ్యంగా ఇందులో కొన్ని ఫైట్స్ సీన్లు అప్పట్లో భాషా మూవీని తలపిస్తున్నాయి.  మొత్తానికి దర్భార్ మూవీ మరో భాషా కానున్నదా అంటున్నారు రజినీ ఫ్యాన్స్. అయితే భాషా మూవీలో మాఫియా అధినేతగా కనిపిస్తే.. దర్భార్ లో మాత్రం ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు రజినీకాంత్.  చంద్రముఖి తర్వాత రజినీ సరసన నటిస్తున్నారు నయనతార.  ఈ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ మరో ప్లస్ అంటున్నారు.  మొత్తానికి ఈ రోజు రిలీజ్ అయిన మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: