స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్భార్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఎప్పటి నుంచో తన అభిమాన హీరో అయిన రజినీతో ఒక మూవీ తీయాలని కోరికతో ఉన్న మురుగదాస్ ‘దర్భార్’ తో తీర్చుకున్నారు.  ఈ మూవీ ఆయనకు ఎంతో ప్రత్యేకమని.. తన చిరకాల కోరిక తీరిందని ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు.  సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార నటిస్తున్న ‘దర్భార్’ మూవీ రిలీజ్ అయ్యింది.   ఇక సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లో రజినీ స్టైల్ దుమ్మురేపినట్లు కనిపిస్తుంది. గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు.

 

తాజాగా ఈ మూవీ గురించి అప్పుడే రక రకాల టాక్ వినిపిస్తుంది. దర్భార్ లో రజినీకాంత్ అద్భుతంగా నటించాడు అనేకంటే తలైవా సరికొత్తగా కనిపించాడు అని చెప్పవచ్చు.  ప్రతి ఫ్రేమ్ లో తలైవా అద్భుతంగా ఉన్నారని చాలా మంది అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాలో మెయిన్ హైలెట్ అని చెబుతున్నారు.  ఇక ఫస్ట్ హాఫ్ లొనే తలైవా తన నట విశ్వరూపాన్ని చూపించడాని, సెకంస్ హాఫ్ లో దర్శకుడు స్క్రీన్ ప్లే తో ఇరగదీశాడని అంటున్నారు.

 

ఈ కాలంలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ఎలా ఉండాలో మూవీలో అర్థం అయ్యేలా చెప్పారని అంటున్నారు అభిమానులు.  మూవీలో రజినీను ఎలివేట్ చేసే సీన్స్ తో డీసెంట్ గా ఉన్నాయని అంటున్నారు.  రజిని మార్క్ డైలాగ్ "ఐమ్ ఏ బ్యాడ్ కాప్" అంటూ ఇంటర్వెల్ లో చెప్పిన డైలాగ్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించింది. ఇక హీరోయిన్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా స్కోప్ లేకపోయినా.. రజినీ, నయన్ మద్య వచ్చే సన్నివేశాలు.. చాలాఫన్నీగా ఎమోషన్ గా సాగాయని అంటున్నారు. ఇంటర్నేషనల్ డాన్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి అద్భుతమైన నటనను కనబరిచాడు.

 

అతని స్టైల్ అండ్ విలనిజమ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. 2.0 లో అక్షయ్ ఏ రేంజ్ లో తన విలనీజం చాటాడో అదే రేంజ్ లో సునీల్ శెట్టి మెప్పించారని అంటున్నారు. తమిళ్ రజిని అభిమానులకు సినిమా అయితే బాగా నచ్చేసినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కోరుకునే యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నాయి.  అయితే ఈ మూవీ టాక్ ఇప్పటికి ఇలా ఉంది.. సాయంత్రం వరకు రివ్యూలు ఏ విధంగా వస్తాయో.. సినిమా హిట్టా.. ఫట్టా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: