విజయశాంతి.. చిరు.. ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే వీరు కలిసి నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్ లే. ఎందుకంటే.. అప్పట్లో వీరి ఇద్దరి కాంబినేషన్ అంత అద్భుతంగా ఉండేది. అయితే కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న విల్లు మొన్న చిరంజీవి ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఈరోజు విజయశాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. 

 

అయితే ఈ నేపథ్యంలోనే అప్పట్లో వాళ్ళు తీసిన సూపర్ హిట్ చిత్రాల గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. మొన్న ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి విజయశాంతితో కలిసి చేసిన అల్లరి అంత ఇంత కాదు.. అందరి చూపు ఈ ఓల్డ్ జంటపైనే పడింది. ఎందుకంటే.. వయసు వచ్చిన సరే.. ఓల్డ్ జంట చూడటానికి ఎంతో అందంగా కనిపించింది. 

 

ఈ నేపథ్యంలోనే.. వారు ఎన్ని సినిమాలు తీశారు.. ఎందుకు తియ్యడం ఆపేశారు అని కొందరు నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేసేసుతున్నారట.. ఈ సమయంలోనే వీరిద్దరికి సంబంధించిన ఓ రహస్యం బయటకు వచ్చింది. అదేంటంటే.. చిరంజీవి, విజయశాంతి కలిసి దాదాపు 19సినిమాలలో నటించారు.. సంఘర్షణ, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, చాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపథం, పసివాడి ప్రాణం, స్వయంకృషి, మంచి దొంగ, యముడికి మొగుడు, యుద్ధభూమి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు వంటి 19 చిత్రలలో కలిసి నటించారు. 

 

అయితే ఈ సినిమాలలో ఎవరో రెండు మూడు అట్టర్ ప్లాప్ అయినా.. మిగితా అన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పట్లో అందరూ వీళ్ళ పెయిర్ ని హిట్ పెయిర్ అనేవాళ్లట. అలాంటి హిట్ పెయిర్ లో ఉన్నట్టు సినిమాలు ఇద్దరు కలిసి తియ్యడం మానేశారు. అది ఎందుకు అంటే... విజయశాంతితో హిట్ పెయిర్ అని అంటే.. నావల్లే సినిమా హిట్ అవుతుంది.. చిరు వాళ్ళ కాదు అని అప్పట్లో ఎవరితోనో అనిందట.. ఈ విషయం చిరుకి తెలిసి.. ఏంటి అంత మాటా అనిందా విజయశాంతి అని.. అప్పటి నుండి నేను ఆమెతో కలిసి సినిమాలలో నటించాను అని చిరంజీవి అన్నారట. అందుకే సినిమాలు ఆగిపోయాయని ఓ రహస్యం ఈ మధ్యే బయటకు వచ్చింది. మరి ఈ రహస్యంలో ఎంతమాత్రం నిజం ఉందొ తెలీదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: