సూపర్ స్టార్ రజినికాంత్, ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా దర్బార్. రజినికాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే సినిమా హిట్ అనే టాక్ వినిపిస్తుంది. రొటీన్ కథ అయినా సరే మురుగదాస్ స్క్రీన్ ప్లే రేసీగా రాసుకోవడంతో పాటుగా రజినికాంత్ ను చాలా స్టైలిష్ గా చూపించాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు మరో హైలెట్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా అని అంటున్నారు. సినిమాలో సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ అయ్యేలా లేకపోయినా బిజిఎం మాత్రం అదరగొట్టారని తెలుస్తుంది.

 

కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుద్ తన సత్తా చాటుతున్నాడు. రజినికాంత్ పేట సినిమాకు కూడా అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు దర్బార్ సినిమాకు కూడా అనిరుద్ అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది. సినిమా కథనానికి తగినట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా చేశాడు అనిరుద్ రవిచంద్రన్. ఈమధ్య రజిని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. కాని దర్బార్ సినిమాకు మొదటి షో నుండి హిట్ టాక్ వచ్చింది.

 

సంక్రాంతికి సైలెంట్ గా వచ్చిన దర్బార్ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకుంది స్ట్రాంగ్ గా మారింది. అయితే సంక్రాంతికి వస్తున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలకు రజిని దర్బార్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలే కాదు నందమూరి కళ్యాణ్ రాం ఎంత మంచి వాడవురా సినిమాపై కూడా రజిని సినిమా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి తెలుగు స్ట్రైట్ సినిమాలు ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి. రజిని సినిమా మాత్రం ఈ పాజిటివ్ టాక్ తో ఈసారి మంచి లాభాలు తెచ్చేలా ఉందని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: