టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన తాజా సినిమా దర్బార్. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు, ప్రేక్షకుల్లో మరియు రజినీ ఫ్యాన్స్ లో సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. ఇక పోతే ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతోంది. 

 

ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేత థామస్ మరొక ముఖ్య పాత్రలో నటిస్తోంది ఇక ఈ సినిమా టాక్ ను బట్టి చూస్తుంటే, ఫస్టాఫ్ మొత్తం మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో ముందుకు సాగినట్లు తెలుస్తోంది. అలానే ఫస్టాఫ్ లో రజిని వన్ మ్యాన్ షో చేశారని, కంప్లీట్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఫ్యాన్స్ ని కనువిందు చేశారని అంటున్నారు. అలానే రజిని డైలాగులు, ఫైట్స్ వంటివి బాగున్నప్పటికీ ఫస్టాఫ్ ఓవరాల్ గా గా అంత ఆసక్తికరంగా సాగదని అంటున్నారు. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ సినిమాపై అలానే సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుందట. 

 

ఆ తర్వాత ఒకింత మెల్లగా ప్రారంభమైన సెకండాఫ్, అక్కడక్కడా మధ్యలో కొన్ని ల్యాగులతో ముందుకు సాగుతుందట. మధ్యలో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ, సినిమాని మొత్తంగా మురుగదాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో పర్వాలేదనిపించేలా ముందుకు నడిపించాడని, ఇక క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఈ సినిమాకి యావరేజ్ టాక్ లభించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: