2001వ సంవత్సరంలో దీన అనే సినిమాతో కోలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన మురుగదా,స్ ఆ తర్వాత సూర్యతో గజిని సినిమా తీసి సూపర్ హిట్ కొట్టడం జరిగింది. తమిళ్ తో పాటు ఆ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ సాధించింది. ఆపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో స్టాలిన్ అనే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశాడు మురుగదాస్. అప్పట్లో ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. అనంతరం సూర్య తోనే మరొకసారి సెవెంత్ సెన్స్ అనే సినిమా తీసి ఘోర పరాజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ తో తుపాకి అనే సినిమా తీసిన మురగదాస్, ఆ సినిమాతో పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. 

 

అలానే మరొక్కసారి విజయ్ తోనే కత్తి సినిమా తీసి ఇంకొక బ్లాక్ బస్టర్ అందుకున్న మురుగదాస్, అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ అనే ఫ్లాప్ సినిమా తీశాడు. ఇక ఇటీవల ఆయన విజయ్ తో మూడవసారి జతకట్టి, తీసిన సర్కార్ సినిమా కూడా ఆశించిన రేంజ్లో హిట్ కాలేదు. కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో తొలిసారిగా మురుగదాస్ తీసిన దర్బార్ నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రజినీకాంత్ ఫ్యాన్స్ లో, అలానే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. 

 

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే మొదటి నుంచి మంచి మెసేజ్ తో కూడిన కథాంశాలను తన సినిమాల కోసం ఎంచుకునే మురుగుదాస్, ఈ సినిమా కథను కూడా ఆ విధంగానే ఎంచుకొని దానికి పలు మాస్,కమర్షియల్ హంగులు జోడించి నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ మాస్ యాక్షన్ స్టైల్ తో పాటు మురుగదాస్ మార్క్ టేకింగ్ తో సాగిన ఈ సినిమా, మురుగదాస్ కెరీర్లో మరొక స్పైడర్ గా నిలుస్తుందో లేక స్టాలిన్ రేంజ్లో యావరేజ్ గా నిలుస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: