సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం `ద‌ర్బార్‌` మురుగుదాస్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో ర‌జ‌నీకాంత్ సోలో పెర్ఫార్మెన్స్ అదుర్స్ అని కొంద‌రు అంటుంటే... మ‌రికొంద‌రు కాస్త సాగ‌దీసిన‌ట్లుంద‌ని భావిస్తున్నారు.  సినిమా మ‌త్తంలో రజిని మార్క్ డైలాగ్ "ఐమ్ ఏ బ్యాడ్ కాప్ అన్న‌ది సినిమాలో కాస్త ఎక్కువ‌గా వినిపించ‌డంతో కొంచం సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా త‌న మార్క్‌ని నిల‌బెట్టేందుకు మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఎక్కువ‌గా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు అనిపించింది. 

 

ఏడుప‌దుల వ‌య‌సులోనూ ర‌జ‌నీలో ఇంకా ఆ స్పార్క్ త‌గ్గ‌లేదు. కానీ త‌న మార్కు బ్లాక్ బ‌స్ట‌ర్‌ని మాత్రం ఆయ‌న అందుకుని చాలా కాల‌మే అవుతోంది. మాస్ట‌ర్ మైండ్‌ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రోబో` త‌రువాత త‌లైవా ఆ స్థాయి హిట్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. కొచ్చాడియాన్ నుంచి పేట‌ వ‌ర‌కు ర‌జ‌నీమార్కు సినిమా రాలేద‌నే చెప్పాలి. ఆ లోటుని `ద‌ర్బార్‌` తో తీర్చ‌బోతున్నాం అంటూ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్ చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పారు. 15 ఏళ్లుగా మురుగ‌దాస్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఎదురుచూసిన ర‌జ‌నీకి. ఈ చిత్రం కాస్త ప‌ర్వాలేద‌నిపించింది. ఒక సినిమా సూప‌ర్‌హిట్ కావాలంటే దానికి ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. ఆ మ్యాజిక్ ఈ సినిమాకు జ‌రిగింద‌ని ర‌జ‌నీ కూడా భావిస్తున్నట్లు ఇటీవ‌లె జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ర‌జ‌నీ తెలిపారు. మొత్తానికి ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ సోలో హీరోగా కాస్త సాగ‌దీస్తున్న‌ట్లు కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయి.

 

భారీ చిత్రాల కెమెరామెన్ సంతోష్‌శివ‌న్ ఫొటోగ్ర‌ఫీ సినిమా లుక్‌ని మార్చేసింది. ప్ర‌తీ ఫ్రేమ్‌ని చాలాగ్రాండీయ‌ర్‌గా చూపించారు. త‌లైవా ర‌జనీ వ‌య‌సుని త‌గ్గించి స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా విష‌యంలో అక్కీయెస్ట్ ప‌ర్స‌న్ ఎవ‌రంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌. `పేట్ట` త‌రువాత ర‌జ‌నీతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ద‌క్కింది. వ‌చ్చిన అవ‌కాశాన్ని బాగానే స‌ద్వినియోగం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: