ర‌జ‌నీ తెర పై క‌నిపిస్తే  చాలు ఫ్యాన్స్ కి పండ‌గే.   ర‌జ‌నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మ‌రి. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్స్‌తో , మేన‌రిజ‌మ్స్‌తో వెండితెర పై మెరుపులు మెరిపిస్తున్నారు. త‌న సినిమాల‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు.  మాస్ట‌ర్ మైండ్‌ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రోబో` త‌రువాత త‌లైవా ఆ స్థాయి హిట్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. కొచ్చ‌డ‌యాన్ నుంచి పేట‌ వ‌ర‌కు ర‌జ‌నీమార్క్‌ సినిమా రాలేద‌నే చెప్పాలి. ఆ లోటుని `ద‌ర్బార్‌` తో తీర్చ‌బోతున్నాం అంటూ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్ చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పారు. 

 

అయితే ఫస్ట్ హాఫ్ సోసోగా ప‌ర్వాలేదు అని అనుకుంటే.. సెకండాఫ్ లో కూడా అంత కొత్తదనం ఏమి అనిపించ‌లేదు. రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది. ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే అని చెప్పాలి. కథానుసారం వచ్చే ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ , రజిని మార్క్ ఎలివేషన్ సీన్స్ బాగానే ఉంటాయి. కానీ ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. ఎంత స్క్రీన్ ప్లే బాగున్నా ఒక‌ప్పుడు డిఫ‌రెంట్ క‌థ‌లు మాత్ర‌మే ఎంచుకునే మురుగ‌దాస్ ఇటీవ‌ల మ‌రీ రొటీన్ స్టోరీలు తీసుకుంటున్నాడు.. ఓ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ రేంజ్‌కు త‌గ్గ క‌థ మాత్రం ఇది కాదు. ఒక‌ప్పుడు మురుగుదాస్ తీసుకునే క‌థ‌ల‌లో కొత్త‌ద‌నం క‌నిపించేది.

 

డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవారు. చిరంజీవితో చేసిన స్టాలిన్ ఓ సోష‌ల్ ఎవేర్నెస్‌కి సంబంధించిన క‌థ‌తో అప్ప‌ట్లో మంచి హిట్‌నే సాధించారు. అలాగే 2008లో సూర్య‌తో `గ‌జిని` చిత్రంలో మ‌తిమ‌రుపు పాత్ర‌తో పాటు ఒక సామాజిక అంశాని తీసుకుని ఆశ‌క్తి రేకెత్తించిన తీరు అన్ని భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది.  అయితే తెలుగులో మ‌హేష్‌బాబుతో 2017లో తీసిన స్పైడ‌ర్ ఇంట‌లెక్ట్యువ‌ల్ క‌థాంశం అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆకట్టుకోలేక‌పోయింది. దాంతో తాను ఎప్ప‌టికైనా మ‌హేష్‌బాబుతో మాట్లాడాలంటే కాస్త బెరుకుద‌నం ఉండేద‌ని ఇటీవ‌లె జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: