హీరో అంటే జిమ్మిక్కులు చేసి హీరోయిన్‌ని పడగొట్టడం, నలుగురు రౌడీల్ని కొట్టడం… క్లైమాక్స్‌లో విలన్‌పై విజయం సాధించడం.. ఇది రొటీన్‌.. ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది.. ఎక్స్‌పరిమెంట్‌.. ఎక్స్‌పరిమెంట్‌ ఎవ్వరు చేస్తే బొమ్మ సూపర్‌హిట్‌ అవుతుందో వాడే హీరో.. అలాంటి హీరో ఉన్నాడు… మరో ప్రయోగంతో సిద్ధమవుతున్నాడు. సూర్య… అందరికీ తెలిసిన తమిళ హీరో… తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కథానాయకుడు… చాలా సాదాసీదాగా ఉంటాడు.. పెద్ద హైటేం కాదు… కానీ ఒక్కసారి క్యారెక్టర్‌లోకి ఎంటరయ్యాడంటే దుమ్మురేగాల్సిందే… పవర్‌ఫుల్ క్యారెక్టర్లే కాదు ఎక్స్‌పరిమెంట్లు చేయడంలో సూర్య తర్వాతే ఎవరైనా… గజిని సినిమా గుర్తుందిగా… ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో అమ్నీషియా పేషెంట్‌గా సూర్య చేసిన నటన సినిమాకు కాసుల కాసుల వర్షం కురిపించింది. పాత్రకోసం గెటప్‌ వేశాడంటే ఇక సూర్య ఏమాత్రం కనిపించడు.. క్యారెక్టర్‌లోకి పరకాయప్రవేశం చేయడమే కాదు ప్రేక్షకుల్ని కూడా తన నటనతో మెస్మరైజ్‌ చేస్తాడు సూర్య.. సెవెన్త్‌ సెన్స్‌లో చేసిన క్యారెక్టరే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. లేటెస్ట్‌గా మరో ఎక్స్‌పరిమెంట్‌ చేస్తున్నాడు సూర్య. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూర్య డిఫరెంట్‌ గెటప్‌తో కనిపిస్తున్నాడు… ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్ని సూర్య పోషిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత సూర్యతో జోడీ కడుతోంది.. ప్రకాశ్‌రాజ్‌, మనోజ్‌వాజ్‌పాయి, నదియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ లింగుస్వామి..

మరింత సమాచారం తెలుసుకోండి: