సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. కాగా రజినీకాంత్ సరసన నయనతార కధానాయికగా నటించగా కూతురి పాత్రలో నివేత థామస్ నటించింది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి.   

 

కాగా అన్ని అంచనాలు ఉన్న ఈ దర్బార్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి నిర్వహించారు. అనిరుధ్ అందించిన పాటలు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. అంతేకాదు సినిమా అంత అద్భుతంగా ఉంది. పాపం.. మన యువ హీరోలు అందరూ రజిని సినిమా అంటే చాలా లైట్ గా తీసుకున్నారు. ఎందుకంటే..   

 

రజిని కాంత్ గతంలో తీసిన కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అభిమానులు అందరూ భారీ అంచనాలు పెట్టుకోవడం రజినీకాంత్ నిరాశ పరచడం. ఎందుకు అంటే ఆ సినిమా ప్రేమోషన్స్ ఆలా ఉండేవి.. ఆ ప్రేమోషన్స్ కాస్త ఆ సినిమాలపై పెట్టిన రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా ప్లాప్ కాకుండా కనీసం ఆడేవి.. ఇంకా అది పక్కన పెడితే ఈ మురగదాస్ సినిమాలు కూడా అంతే.. 

 

మొన్న వచ్చిన మహేష్ సినిమా స్పైడర్ వంటి సినిమాల ప్లాపులు ఉండే సరికి కుర్ర హీరోలు అందరూ సినిమా పెద్ద హిట్ అవ్వదు అనుకున్నారు. పండగ ముందు వస్తుంది కదా.. పండగ ముందే పోతుందిలే అనుకున్నారు. అలా అనుకున్న హీరోలందరికి గట్టి షాక్ ఇచ్చాడు రజినీకాంత్. ఊహించని రీతిలో సినిమాను హిట్ చేసి యునాన‌మ‌స్ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు వచ్చే ఈ సినిమాల‌కు టెన్ష‌న్ ఎంతైనా ఉంటుంది.. కుర్ర హీరోలకు గెట్టి షాక్ ఇచ్చాడు రజినీకాంత్. 

మరింత సమాచారం తెలుసుకోండి: