తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా... దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్ . ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించు  కుంటూ దూసుకుపోతోంది. గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సూపర్ స్టార్ రజినీకాంత్ సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఎన్నో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సూపర్ స్టార్ రజినీకాంత్ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఇకపోతే తాజాగా దర్బార్ సినిమాతో  ప్రేక్షకుల ముందుకొచ్చాడు రజినీకాంత్. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటు దూసుకుపోతుంది. దీంతో రజినీకాంత్ ఇన్నేళ్ళకి భారీ  హిట్టు చేరిపోవడం ఖాయం గా కనిపిస్తుంది. 

 

 

 ఇక ఈ సినిమా కథ రొటీన్ అయినప్పటికీ మురుగదాస్ తెరకెక్కించిన తీరు మాత్రం ఆకర్షిస్తోంది. రొటీన్ కు  భిన్నంగా తెరకెక్కించారు దర్శకుడు మురుగదాస్. ఈ సినిమాలో  సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ యాక్షన్ ను బాగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు మురుగదాస్. ఒక సాదా సీదా కథని అందరికీ తెలిసిన కథని అద్భుతంగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అలాంటి సినిమానే దర్బార్ . అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో   సూపర్ స్టార్  రజనీకాంత్ పవర్ ఫుల్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తోంది. పోలీస్  పోలీస్ పాత్రలో రజినీకాంత్ ఎప్పటిలాగే అదరగొట్టేసారు. ఇక మరో అంశం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా రజనీకాంత్ కు అసలు సిసలైన సమఉజ్జి  అని నిరూపించుకున్నాడు. 

 

 

 అయితే ఈ సినిమా ఎక్కువగా మాస్ బిసి సెంటర్లు మరియు అభిమానులు ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. రజినీకాంత్ యాక్షన్ ఎలిమెంట్స్ బీసీ సెంటర్ ల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి కాబట్టి ఇక సినిమా చూడడానికి వెళ్లిన ప్రేక్షకులందరూ సినిమా థియేటర్లు గోల గోల చేస్తున్నారు. దీంతో ఈరోజు సినిమా థియేటర్లన్నీ అభిమానుల ఈలలు గోలలతో  హోరెత్తుతున్నాయి. ఈ సినిమా ఎక్కువగా బిసి సెంటర్ల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాకు బి సి సెంటర్ల ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. బీ సి సెంటర్ల ప్రేక్షకులను ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార నటన కూడా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఈ సినిమా హిట్టు తో సూపర్ స్టార్ రజినీకాంత్ ఖాతాలో భారీ హిట్ చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: