దర్బార్.. అబ్బా సినిమా హిట్టు.. అని అనేలా సినిమా ఉంది అని చుసిన ప్రేక్షకులు చెప్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. సినిమా అంత గొప్పగా ఉంది అంటున్నారు. కానీ కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా రివ్యూ ఇస్తున్నారు. సాధారణంగానే సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది అంటే అభిమానులు ఓ రేంజ్ లో ఊహించుకుంటారు.          

 

అలానే మురుగదాస్ అంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉంటాయి. వాటిని ఫస్ట్ హాఫ్ లో మురుగదాస్ ప్రేక్షకులు ఎక్ష్పెక్త్ చేసినంత అందుకోలేకపోయారు. సినిమాలో క‌థ కంటే కేవలం రజినీ మాత్రమే హైలైట్ అయ్యారు కానీ చిత్రంలోని మరే ఇతర అంశాలు అంత గొప్పగా అన్పించ లేదు అని అంటున్నారు.            

 

అయితే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది అనుకుంటే సెకండాఫ్ లో కూడా అంత కొత్తదనం ఏమి ఉండదు.రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది. ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే అని చెప్పాలి. అయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకులు అంత ఆనందంగా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మాములు సినిమా కంటే ఈ సినిమాపై కాస్త ఎక్కువగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే కొంతమేరకు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు మురుగదాస్.                

 

ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రజినీకాంత్ సరసన నయనతార, కూతురి పాత్రలో నివేత థామస్ అదరగొట్టారు అని ప్రేక్షకులు చెప్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి నిర్వహించారు. అనిరుధ్ అందించిన పాటలు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: