'సూపర్ స్టార్ రజనీకాంత్'…! పేరు చెప్తే తమిళనాట అంతా పూనకంతో ఊగి పోతారు. ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదంటే ఆయన సినిమా రిలీజవుతుందంటేనే వారం మొత్తం గొడ్డు చాకిరీ చేయించుకునే ఆఫీస్ వారు కూడా సెలవులు ఇచ్చి వారి ఉద్యోగులకు టికెట్లు కొని పెడతారు. ఆరోజు వారికి ఒక పండగ... అన్ అఫీషియల్ బంద్ అన్నట్లు. అయితే ఆయన ఇమేజ్ కు తగ్గ సినిమా తీసేటప్పుడు అతని క్రేజ్ ను అతిగా అంచనా వేసి సినిమా మొత్తం అతనొక్కడినే పెడితే ఎలా ఉంటుందంటే 'దర్బార్' లాగా ఉంటుంది.

 

దర్బార్ సినిమా చూసిన వాళ్లు అందరూ చిత్రంలో రజిని యొక్క స్టైలు మరియు స్వాగ్ తప్ప మరి ఏమి కనబడలేదు అంటున్నారు. ముఖ్యంగా కామెడీ సీన్ లలో రజినీని బీట్ చేయడం ఎవరి తరం కాదు. యోగిబాబు రజిని తో పాటు బాగా కలిసిపోయి నవ్వించిన తర్వాత వచ్చే అసలైన కథలో మొత్తం అందరికీ రజిని మాత్రమే కనబడ్డాడు. ఇంతకుముందు రజనీ నటించిన హిట్ సినిమాలను గనుక చూసుకుంటే అందులో బలమైన కథతో పాటు అతని పాత్రను ఛాలెంజ్ చేయగలిగే నటీనటులు ఉండేవారు.

 

కానీ సినిమాలో మాత్రం కేవలం అతని హీరోయిజం మీదనే సినిమా నడవడం మరియు దాని కోసం అర్థం పర్థం లేకుండా రెండో భాగంలో కథ నడపడం ఇంకా ఓవర్ డోస్ క్లైమాక్స్ ను చిత్రీకరించడం వంటివి మురుగదాస్ భారీగా చేసిన తప్పిదాలు. ఇప్పటికైనా ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసేటప్పుడు ఒక మంచి కథతో ప్రతి ఒక్క పాత్రకి సరైన ప్రాముఖ్యత ఇస్తేనే దాని నుండి హీరోయిజం ఎలివేట్ అవుతుందని ఎంత పెద్ద దర్శకుడైనా తెలుసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: