సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ .ఆర్‌.మురుగ‌దాస్ దర్శ‌క‌త్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ద‌ర్బార్‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా  నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో మాత్రం చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ విడుదల చేశారు. అయితే సినిమాకు ఒక పక్క సూపర్ స్టార్ రజినీ హీరో కావడం మరోపక్క మురగదాస్ వంటి హిట్ డైరెక్టర్ కావడంతో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి

 

ఇక చిత్రం విషయానికి వస్తే ఇప్పటికే చాలాసార్లు రజిని ప్రేక్షకులు మాస్ అవతారంలో చూసేశారు. ప్రేక్షకులకి కావాల్సింది అదే అయినా కూడా ఒక రొటీన్ స్టొరీ పెట్టేసి అందులో రజిని పాత్రను మాత్రమే హైలెట్ చేసి కథ నడిపించడం అనేది చాలా బోరింగ్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. కలెక్షన్ కావాలంటే మాస్ ఆడియన్స్ ను కదిలిస్తే చాలు అనే మూఢనమ్మకానికి క్రమేపీ ప్రేక్షకులు నాంది పలుకుతున్నారు. రజనీకాంత్ లాంటి అద్భుతమైన నటుడు ఉన్నప్పుడు రొటీన్ స్టోరీ కాకుండా కథలో కొంచెం వైవిధ్యం కూడా జోడించి తీస్తే ఇక దాని ముందు ఎటువంటి సినిమా పనికిరాదు అన్నది వాస్తవం.

 

అసలు మురుగదాస్ అంటేనే వైవిధ్యానికి మారుపేరుగా అయిన నేపథ్యంలో అతని నుండి ప్రేక్షకులు ఇటువంటి రొటీన్ చిత్రాన్ని అయితే ఊహించలేదు. తన మార్కు సన్నివేశాలు మరియు ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో పూర్తిగా కరువయ్యాయి అనే చెప్పాలి. ఇంకా ఎన్నిరోజులు ఇలా రొటీన్ సినిమాలు చేసుకుంటూ హీరోని ఎలివేట్ చేస్తూ సీన్లు రాసుకోవడం అని ఆఖరికి ఫాన్స్ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇంకా కరెక్ట్ గా చూస్తే రజిని చేసినా ముందు సినిమాలకు ఈ సినిమాలో కూడా కొన్ని పోలికలు ఉంటాయి. ఇకనైనా ఈ ఆచారానికి స్వస్తి పలికి రజనీ లాంటి గొప్ప హీరోలని ఎలా ఉపయోగించుకోవాలో దర్శకులు తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: