ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. అయితే రోబో త‌ర్వాత రజినీ చాలా సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ హిట్ మాత్రం ద‌క్కలేదు. తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ చేసిన సినిమా `ద‌ర్బార్‌` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.

 

అయితే  క‌థ‌ వెళ్లినట్టయితే ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) మాంచి యాటిట్యూడిక్ పోలీస్ ఆఫీసర్. ఢిల్లీ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఇదే నేపథ్యంలో విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు. ఇక వీరిద్ద‌రికి సంబంధం ఏంటి..? అన్న‌దే క‌థ‌. ఇదిలా ఉంటే.. దాదాపు 15 ఏళ్లుగా ర‌జ‌నీ మురుగ కాంబినేస‌న్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేశారు. అయితే ఇంత నిస్సార‌మైన క‌థ‌తో సినిమా తీయ‌డం ఏంట‌ని సోస‌ల్ మీడియాలో వాళ్లంతా ఫైర్ అవుతున్నారు. 

 

వీక్ క‌థ‌తో ర‌జ‌నీ చ‌రిస్మాను న‌మ్ముకుంటే ఎలా మురుగ‌దాస్‌... ఇందుకేనా నీకు ర‌జ‌నీ మంచి అవ‌కాశం ఇచ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రజినీకాంత్ సినిమా అంటే స్టైల్‌కు పెద్దపీట వేస్తారు దర్శకులు. ఆయన ఇమేజ్ వాడుకుంటూ కథ రాసుకుంటారు. ఇప్పుడు మురుగదాస్ కూడా ఇదే చేసాడు. దేశంలో చాలా చోట్ల హైలైట్ అవుతున్న డ్రగ్స్‌తో పాటు ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు మురుగదాస్. అయితే రొటీన్ స్టోరీ కావ‌డంతో అభిమానులు కాస్త నిరుత్సాప‌డ్డార‌ని చెప్పాలి. కానీ.. రాజినీకాంత్ మాత్రం వాకింగ్, స్టైల్, డైలాగ్స్‌తో రప్ఫాడించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: