రజినీకాంత్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు.. రజినీకాంత్ గొప్ప సినిమా నటుడు. దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.తలైవా అంటే తమిళ తంబిలకు ఎనలేని అభిమానం.. అయన స్టైల్ వేరే ఎవరికి రాదు... ఈ సంవత్సరం సంక్రాంతి పండగను అందరికంటే ముందు మొదలుపెడతున్నాడు రజినీకాంత్. 

 

మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. చాలా ఏళ్ళ తర్వాత ఈయన ఖాకీ డ్రస్ వేసుకున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది... ముందు వచ్చిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో దర్బార్ మూవీ ఇచ్చినా బూస్ట్ తో అభిమానులు ఆనందం మాములుగా లేదు.

 

దర్బార్ సినిమాను ప్రదర్శిస్తోన్న థియేటర్ల వద్ద అభిమానులు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ ఆనందం కాస్తా రెట్టింపు అయింది. తమ ఆరాధ్య దైవం సినిమా హిట్ కావడంతో పండగ చేసుకుంటున్నారు.ఆరాధ్యదైవం, వెండితెర ఇలవేల్పు సినిమా హిట్ కావాలంటూ తాము చేసిన పూజలు, పునస్కారాలు ఫలించాయంటూ తమ ఆనందాన్ని చాటుకున్నారు.

 

థియేటర్ల వద్ద మంగళ వాయిద్యాలను మోగిస్తూ, రజినీ స్టైల్లో స్టెప్పులు వేస్తూ అలరించారు. తమిళనాడు మొత్తంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రజినీకాంత్ నటించిన పేట్టై సినిమా సూపర్ హిట్ అయ్యిందని, దర్బార్ మూవీ దాన్ని మించిపోయిందని ఎగిరి గంతులేస్తున్నారు అభిమానులు.

 

కధ రొటీన్ అయినప్పటికీ రజనీకాంత్ నటన అద్భుతంగా ఉంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇరగదీసారు... ఇంటర్వెల్ ముందు విలన్ ఎంట్రీ సూపర్... సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన ప్రీ క్లైమాక్స్ సీన్స్ మాత్రం అదరగోట్టాయి.. సినిమాహాల్లో ప్రేక్షకులని నుంచోనివ్వకుండా చేసింది.. తలైవా నటన వావ్ అనిపించింది... మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.. టోటల్ గా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది... సంక్రాంతి కి పోటీగా నిలవనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: