కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్భార్’ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 'కబాలి', 'కాలా', '2.O', 'పేట్టా' సినిమాల తరువాత సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'దర్బార్' భారీ అంచనాల మద్య నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  ఒకదశలో మూవీ రిలీజ్ నిలిపి వేయాలని  మలేషియాకు చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి అన్ని అవరోధాలు దాటి నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దర్భార్.  ఈ మూవీ టీజర్, ట్రైలర్ లో రజినీ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా  చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. దాంతో ఆయన అభిమానులే కాదు.. యావత్ రజినీ ప్రేక్షకులు తమ హీరో దుమ్మురేపబోతున్నాడని తెగ సంబరాలు చేసుకున్నారు. 

 

అయితే థియేటర్లో రిలీజ్ అయిన ‘దర్భార్’ ని చూసి ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహమే పొందారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక రజనీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్న దర్శకుడు మురుగదాస్, మైండ్ గేమ్ తో పాటు, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాను రసవత్తరంగా నడిపించారని రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటున్నా.. ఎప్పటి లాగే నాలుగు పంచ్ డైలాగ్స్.. సందర్భం లేని ఫైట్స్ ఆకట్టుకోలేని సాంగ్స్ తో బోర్ అంటూ కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆటోమెటిక్ గా హిట్ టాక్ వస్తుందని.. కంటెంట్ పరమ రొటీన్ గా బోర్ గా ఉంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఫలితం శూన్యమే అంటున్నారు సగటు ప్రేక్షకులు.

 

‘దర్భార్’ మూవీ చూసిన వారి అభిప్రాయం ఎలా ఉంటుందో.. ఆ సినిమా చూడాలా? వద్దా ? అనే అభిప్రాయం ఎలా తెలపనున్నారో రేపటిలోగా తెలిసిపోతుంది.  ఇక తమిళనాట రజినీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.. అక్కడ రజినీ మానియాతో కొంత వరకు నెట్టుకు రావొచ్చు.. కానీ  తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాపై వేరేలా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీ రజినీ ఫ్యాన్స్ తప్పక చూడాలని.. అప్పుడే ఆయనపై నిజమైన అభిప్రాయాన్ని చెబుతారని సినీ వర్గాలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: