తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్ . ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ వచ్చింది. ఇప్పటికే మురుగదాస్ రజినీకాంత్ కాంబినేషన్లో హిట్ సినిమాలు రావడం దీనికి కారణం. కాగా ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక  ఈ సినిమాలో రజనీకాంత్ చాలా ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో అభిమానులు అంచనాలు మరింత పెరిగి పోయాయి. ఎందుకంటే రజినీ అభిమానులు అందరూ రజనీకాంత్ ను పోలీస్ పాత్రలో చూసి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో  సూపర్ స్టార్  రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. 

 

 

 అంతే కాకుండా దర్బార్ సినిమాలో రజనీకాంత్ కూతురు గా నివేద థామస్ నటించింది. ఇకపోతే ఈ సినిమా రొటీన్ కథగానే తెరకెక్కింది. కానీ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మాత్రం ఈ సినిమాను రొటీన్ కథే అయినప్పటికీ భిన్నంగా తెరకెక్కించి ప్రేక్షకులందరూ సాటిస్ఫై అయ్యేలా చేశారు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది . గత కొన్ని రోజుల నుండి సరైన హిట్ లేక అయోమయంలో పడిన రజనీకి దర్బార్ సినిమా మంచి విజయాన్ని అందించినది  అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో అంతా బాగానే ఉంది కానీ... సెకండాఫ్ కాస్త నెమ్మదించడం క్లైమాక్స్ లో అంతగా మ్యాటర్  లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త హర్ట్ అవుతున్నారు. పోలీస్ పాత్రలో ఉన్న రజనీకాంత్ విలన్ పాత్రలో ఉన్న సునీల్ శెట్టి మధ్య సాగే ఎత్తులు పైఎత్తులు అంతా బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది అని ప్రేక్షకులు భావిస్తారు. 

 

 

 మొత్తంగా ఈ సినిమా ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకులు అందరూ ఇంటర్వెల్ సమయంలో ఎక్కడ మళ్లీ బయటికి వెళ్ళగానే సినిమా స్టార్ట్ అవుతుందో ఎక్కడ సినిమా స్టార్ట్ అవుతుందని ఎక్సైట్మెంట్ ఫీలవుతారు. ఇంటర్వెల్ సమయంలో పరిగెత్తుకుని మరి పాప్ కార్న్  తీసుకుంటారు. ఇక సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక మాత్రం నీరసపడిపోతారు.ఎందుకంటే సెకండాఫ్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది అని భావిస్తారు ప్రేక్షకులు. ఫస్టాఫ్ మొత్తం రజిని  స్టైల్,  యాక్షన్ పవర్ఫుల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. సెకండాఫ్ లో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోలేదు అని అర్థమవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం రొటీన్ రొటీన్ గా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు. ఫస్టాఫ్ చూసినప్పుడు పరిగెత్తుకుని పాప్ కార్న్   తెచ్చుకున్న వారు...  సెకండాఫ్ చూసేసరికి నీరసంగా ఇంటికి వెళ్లాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: