గత కొన్ని సంవత్సరాల నుండి రజనీకాంత్ నుండి వస్తున్న సినిమాలు రజనీకాంత్ ఫ్యాన్స్ ను, సాధారణ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన దర్బార్ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు బిలో యావరేజ్ టాక్ వినిపిస్తోంది. రజనీకి సక్సెస్ ఇవ్వడంలో మురుగదాస్ కూడా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతున్నాయి. 
 
రజనీకాంత్ అభిమానులు, ప్రేక్షకులు రజనీకాంత్ మరలా అదే తప్పు చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా కావటంతో కథ, కథనాలు వినకుండానే సినిమాను ఓకే చేశాడా...? అని ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. 
 
రజనీ ఎంత స్టైలిష్ గా కనిపిస్తున్నా రజనీ చరిష్మాను నమ్ముకుని దర్శకుడు మురుగదాస్ నేల విడిచి సాము చేశాడు. రజనీ మార్క్ స్టైల్ మేనరిజమ్స్ చూడాలనుకుంటే మాత్రమే దర్బార్ సినిమాను చూడవచ్చు కానీ కథకథనాలు ఆశించి వెళితే మాత్రం ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పదు. మురుగదాస్ కూడా మిగతా దర్శకుల మాదిరిగా రజనీ చరిష్మాపై ఆధారపడి సినిమాలు తీయడం రజనీ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. 
 
ఇప్పటికే రజనీ సరైన కథ, కథనాలు లేని కొన్ని సినిమాల్లో నటించి వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో దర్బార్ విషయంలో కూడా రజనీకాంత్ అదే తప్పు రిపీట్ చేశాడని ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్బార్ లాంటి కథలు ఎంచుకుని రజనీకాంత్ పెద్ద తప్పే చేశాడని ప్రేక్షకుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మురుగదాస్ కూడా ఒకప్పటిలా మ్యాజిక్ చేయలేకపోతున్నాడని ప్రేక్షకులు చెబుతున్నారు. దర్బార్ సినిమా చూసిన ప్రేక్షకులు ఇది అసలు మురుగదాస్ సినిమానేనా...? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: