సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. వాస్త‌వానికి రజినీకాంత్ సినిమాలకు తెలుగు, తమిళ తేడాలుండవు. అన్నిచోట్లా ఆయనకు అభిమానులుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయన రేంజ్‌కు త‌గ్గ హిట్స్ లేవు. రోబో త‌ర్వాత రజినీ చాలా సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ హిట్ మాత్రం ద‌క్కలేదు. ప్ర‌స్తుతం ముంబై క‌మిష‌న‌ర్ ఆదిత్య అరుణాచ‌లంగా ర‌జ‌నీ పండ‌గ‌కు ముందే సంద‌డి చేయ‌డానికి వ‌చ్చేశాడు.

 

ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. ద‌ర్బార్ సినిమా ర‌జ‌నీ గ‌తంలో చేసిన కాలా, క‌బాలీ సినిమాల కంటే బాగుంది. లింగ కంటే కూడా బెట‌రే అని చెప్పాలి. క‌లా, క‌బాలీ అంటూ ర‌జ‌నీ సామాజిక నేప‌థ్యంలో పిచ్చి ప్ర‌యోగాలు చేశాడు. అయితే అవి క‌థా ప‌రంగా బాగున్నా ర‌జ‌నీ మార్క్ సినిమాలు కాదు. ర‌జ‌నీ ఫ్యాన్స్ కు న‌చ్చే పాట‌లు, ఫైట్లు అందులో లేవు. ఈ క్ర‌మంలోనే చాలా నీర‌స‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలాగే ద‌ర్బార్ కూడా గొప్ప సినిమా క‌కాపోయినా ర‌జ‌నీ మార్క్ స్టైల్ ఆయ‌న ఫ్యాన్స్‌కు న‌చ్చే సినిమా కావ‌డంతో జ‌స్ట్ ఓకే అనిపిస్తుంది. 

 

అయితే ర‌జ‌నీ ఫ్యాన్సే కాదు స‌గ‌టు సినీ అభిమాని కూడా ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చాక గుర్తు పెట్ట‌కునేంత సినిమా ఏం ఉండ‌దు. దీనికి ప్ర‌ధాన కార‌ణం రొటీన్ క‌థ కావ‌డం అని చెప్పాలి. దర్బార్ సినిమా  డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా లాంటి సోషల్ ఎలిమెంట్స్‌తో కథను బలంగా రాసుకొన్నారు మురుగ‌దాస్‌. ఓవ‌ర్ ఆల్‌గా థియేటర్‌కి వచ్చే సగటు ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో అన్నీ చూపించేశారు ఈ సినిమాలో.  క‌కాపోతే కథ కొత్తద‌నం లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్ అయింది. ఇక పాత క‌థే అయినా దానికి మంచి స్క్రీన్‌ప్లేను జతచేసి తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. దీంతో సినిమాపై మంచి టాక్ వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: