సూపర్ స్టార్ రజిని కాంత్  సినిమా అంటే  ఆ మాత్రం హంగామా ఉండాలని ఆయన అభిమానులు రజిని సినిమా తేరా మీదకు వస్తుందంటే రచ్చ రచ్చ చేస్తారన్న విషయం తెలిసిందే. తమిళనాడులో మాత్రం ఈ హడావిడి కాస్త ఎక్కువే అని చెప్పాలి. అదిరిపోయే క‌థ‌, క‌థానాలు కొత్త‌గా ఉండాలి.. కానీ మ‌రీ రొటీన్ క‌థ తీసుకుని నిరుత్సాహ ప‌రిచాడు. ఎంత క‌థ‌నం , స్క్రీన్ ప్లే మాయ చేద్దామ‌నుకున్నా క‌థ వీక్‌గా ఉండ‌డంతో సినిమాకు పెద్ద లోటు. మురుగ ర‌జ‌నీతో 15 ఏళ్ల‌కు వ‌చ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నాడ‌నే చెప్పాలి. ఇంకా కేర్ తీసుకుంటే గొప్ప సినిమా అయ్యేది


ఆరుపదుల వయస్సులో రజిని కాంత్ చేసే సాహసాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్న వచ్చిన రోబో నుండి నిన్న వచ్చిన పేట వరకు రజిని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఏదిఏమైనా కూడా ప్రస్తుతం రజిని కాంత్ నటించిన చిత్రం దర్బార్.. ఈ సినిమాలో నయనతార రజిని సరసన నటించింది. ఈ సినిమాలో రజిని కాంత్ పోలీస్ పాత్రలో  నటించారు. రచ్చ లేపిన ట్రైలర్ భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా తాజాగా విడుదలయింది. 

 

మురుగ‌దాస్ తుపాకీ స్టైల్ రేసీ స్క్రీన్ ప్లే ర‌జ‌నీ వ‌న్ మ్యాన్ షో ర‌జ‌నీ యంగ్‌గా క‌నిపించ‌డం అందరికి సంతోషాన్ని కలిగించింది... కాప్ స్టోరీ ఫ‌స్టాఫ్ హైలెట్స్‌...స్టోరీ మామూలుగానే ఉన్నా.. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, ర‌జ‌నీ న‌ట‌న ఫ‌స్టాఫ్ హైలెట్స్ తుపాకీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఎలా త‌న స్క్రీన్ ప్లేతో మ్య‌జిక్ చేశాడో ఇక్క‌డ కూడా అదే చేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మ‌రి సెకండాఫ్ ఎలా ఉంటుందో ?  చూడాలి అని ప్రేక్షకులను ఆలోచింప చేస్తుంది. ఇకపోతే మొత్తానికి సినిమా బాగుందని హిట్ టాక్ వినపడుతుంది. 

 

మరో పక్క అదే పాత క‌థ‌, పాత స్టైలే, పాత ఎమోష‌నే, పాత ట్రీట్మెంటే;  పాత డ్యాన్సే, ప‌రమ రోటీనే అంతా రొటీన్ రొటీనే అంత‌కు మించి మురుగ‌దాస్ స్టైల్ క‌థ‌, క‌థ‌నాలు, ట్రెట్మెంట్ ఆశించ‌వ‌వ‌ద్దు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాయే..అని కొందరు సినిమా పెద్దలు అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ బాగా ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ నత్తనడకలాగా సాగడంతో సినిమా పై అంచనాలు కొంచం తగ్గాయని గుస గుసలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: