స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన దర్బార్ సినిమా ఈరోజు విడుదలైంది. గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులను నిరాశపరుస్తున్న రజనీకాంత్ దర్బార్ సినిమాతో కూడా ప్రేక్షకులను మరోసారి నిరాశపరిచాడు. కోలీవుడ్, టాలీవుడ్ హీరోలు రొటీన్ కథలకు భిన్నంగా సినిమాలను ఎంచుకుంటూ హిట్లు కొడుతోంటే రజనీకాంత్ మాత్రం అవే మూస కథలను ఎంచుకుంటూ వరుస ఫ్లాపులను కొనితెచ్చుకుంటున్నాడు. 
 
రజనీకి ఈ భావ బానిసత్వం ఎప్పటికి వదులుతుందో అని ప్రేక్షకులు, రజనీ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దర్బార్ సినిమాలో అవే పాటలు, అవే ఫైట్లు, అదే రొటీన్ స్టోరీ, అదే పగ తీర్చుకోవటం... ఉండటంతో దర్బార్ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. రజనీకాంత్ నటించిన కాలా, కబాలీ సినిమాలు సామాజిక సందేశంతో కూడిన కథతో తెరకెక్కి ఫ్యాన్స్ కోరుకునే స్టైల్స్, యాక్షన్ లేకపోవడంతో డిజాస్టర్ అయ్యాయి. 
 
రజనీ నటించిన దర్బార్ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే స్టైల్స్, యాక్షన్ ఉన్నా కథాకథనాలు గాలికొదిలేయటంతో సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. రజనీ కేవలం దర్శకుల ఎంపికలో జాగ్రత్త వహిస్తే సరిపోదు. మారుతున్న కాలానికి తగిన విధంగా కథాకథనాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకోవాలి. అప్పుడే విజయాలను అందుకునే అవకాశం ఉంది. 
 
రొటీన్ మూస మాస్ మసాలా ఫార్ములా కథలలో నటిస్తే ఎంతటి సూపర్ స్టార్ అయినా రెండో రోజు నుండే థియేటర్లు కలెక్షన్లు లేక వెలవెలబోతున్నాయనే సత్యాన్ని గ్రహించాలి. అమితాబ్ బచ్చన్ లా రజనీకాంత్ కూడా వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవాలని అప్పుడే విజయాలను అందుకోవచ్చని ఈ రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా ఉండాలని రజనీ, ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: