బట్టలు ఉతకడం ఏంటీ.. కోట్లు సంపాదించడమేంటి, ఆ చివరి ట్విస్ట్ ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే మేము ఈ ఆర్టికల్ లో చెప్పబోయే ఆసక్తికర విషయాలను శ్రద్ధగా చదవండి. వాస్తవానికి, సినిమా హీరోలు ఏదైనా కంపెనీ కోసం ఒక అడ్వటైజ్మెంట్ చేస్తే... కొన్ని కోట్లను ఆ సంస్థ వారు వీళ్ళకి పారితోషికం ఇస్తారు. ఈ పారితోషికం ఇండస్ట్రీని బట్టి, ఇంకా వారి పాపులారిటీ పై ఆధారపడి ఉంటుంది.


వివరాల్లోకి వెళితే నిర్మా వాషింగ్ పౌడర్ కంపెనీ తమ సర్ఫ్ ప్యాకెట్లను ప్రమోట్ చేసే భాగంగా ఒక అడ్వర్టైజ్మెంట్ రూపొందించింది. అయితే ఈ అడ్వటైజ్మెంట్ లో అక్షయ్ కుమార్ కు కోట్లను ఇవ్వగా అతడు ఏ మాత్రం ఆలోచించకుండా ఈ యాడ్ లో నటించారు.

 


జనవరి 5వ తారీఖున రిలీజైన ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ మరాఠ రాజు పాత్రలో నటిస్తాడు. అలాగే ఒక పెద్ద యుద్ధంలో గెలిచి తన సైన్యంతో పాటు రాజమందిరానికి వస్తున్నట్లు ఈ వీడియోలో చూపించబడుతుంది. ఈ యోధులు యుద్ధంలో పాల్గొనందున తమ బట్టలకు మురికి అంటడంతో రాజమందిరం లో ఉన్న ఆడవాళ్ళు ఎద్దేవా చేస్తారు. దాంతో, మరాఠ రాజు పాత్రలో ఉన్న అక్షయ్ 'రాజుకి, ఇంకా తన సైన్యానికి శత్రువులను చంపడంతో పాటు వారి మురికి బట్టలను ఉతకడం కూడా తెలుసు' అంటూ నిర్మా పౌడర్ ప్యాకెట్ ని కత్తితో కట్ చేసి బట్టలు ఉతుకుతాడు.


అయితే, మరాఠ యోధులెందరో దేశరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసారు.. అటువంటి మహానుభావుల దుస్తులను ధరించి తిక్కతిక్కగా ఎగురుతూ, ఆడవాళ్ళతో పరాచికాలు ఆడుతూ బట్టలు ఉతుకుతావా? అసలు నీకు మరాఠ యోధుల చరిత్ర గురించి కాస్తయినా తెలుసా? అంటూ అక్షయ్ కుమార్ ను బాగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మరోవైపు, ఛత్రపతి శివాజీని కించపరిచేలా నిర్మా యాడ్ లో అక్షయ్ నటించాడని కొంతమంది ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నిర్మా యాడ్ ని ఇంటర్నెట్ నుంచి తొలగించాలని లేకపోతే దేశంమొత్తం గొడవలు చేస్తామని అనేకమంది ఇప్పటికే హెచ్చరికలను చేస్తున్నారు. ఏదేమైనా భవిష్యత్తు లో ఈ నిర్మా యాడ్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చుడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: