దర్బార్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోంది.  సినిమాలో కథ లేనప్పటికీ మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా కథనాలను తయారు చేసుకొని సినిమాను మలిచారు.  ఇలాంటి కథతో సినిమా చేయడం అంటే సాహసమే అని చెప్పాలి.  కథలో పెద్దగా దమ్ములేదు... పైగా పాత కథనే.  ఇలాంటి రివెంజ్ స్టోరీలు గతంలో అనేకం వచ్చాయి.  కథలో దమ్ము లేకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.  


కథలో దమ్ము లేకపోయినా కథనాల్లో దమ్ము ఉండటంతో డబ్బులు రాలుతున్నాయి.  రజినీకాంత్ లోని మాస్ యాంగిల్ ను ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేసి సక్సెస్ సాధించాడు మురుగదాస్.  ఒకప్పుడు మురుగదాస్ సినిమాలు ఎలా ఉండేవో అందరికి తెలిసిందే.  కథలో దమ్ము, కథనాల్లో దమ్ము ఉండేది కానీ, ఇప్పుడు ఉన్న కథలకే దుమ్ము దులుపుతున్నారు.  
కథలు లేవు అని చెప్పడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ.

 దర్శకులు కేవలం కథనాల మీదనే ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. కథలు ఎందుకు లేవు అని మన దర్శకులు, కథకులు దానిపై దృష్టి పెట్టడం లేదని చెప్పాలి.  దృష్టి పెట్టడం లేదు కాబట్టి మంచి సినిమాలు రావడం లేదు.  ఉన్న ఆ కొద్దికధలనే కిచిడీలు చేసి, మసాలా దట్టించి సినిమా తీస్తున్నారు.  ఆడితే లక్, ఆడకుంటే బ్యాడ్ లక్.  అంతేకంటే ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పాలి.  


గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమా కూడా ఇలాంటిదే.  తమిళ వాసనలు ఎక్కువగా కనిపిస్తాయి.  అందుకే సినిమా నిలబడలేదు. ఇక స్పైడర్ సినిమా తీసుకుంటే బాబోయ్ అనిపిస్తుంది.  ఇది అసలు మురుగదాస్ సినిమానా కదా అనిపిస్తుంది.  సినిమాలు ఎందుకు పరాజయం పాలవుతున్నాయి అంటే కారణం ఇదే అని చెప్పొచ్చు.  ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకోవడం తప్పే.  కానీ, కథలు లేకుండా సినిమాలు తీయడమే మరీ దారుణం.  

మరింత సమాచారం తెలుసుకోండి: