కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేవలం తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోనే కాక అటు బాలీవుడ్ తో పాటు ఇటు మన తెలుగులో కూడా మంచి మార్కెట్, క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిన తాజా సినిమా దర్బార్ నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. కెరీర్ పరంగా చాలా గ్యాప్ తరువాత రజినీకాంత్, ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమాపై రజిని ఫ్యాన్స్  తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. 

 

ఇకపోతే నేడు ఎన్నో అంచలన మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఓవర్ ఆల్ గా మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ కథలకు తన మార్క్ మాస్, కమర్షియల్ హంగులు అద్ది, సినిమాలు తీయడంలో మంచి పేరు సంపాదించిన ఏఆర్ మురుగదాస్, ఈ సినిమాని కూడా మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కించినట్లు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని, ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందని అంటున్నారు. అయితే కొంత మెల్లగా ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్, అక్కడక్కడా కొంత ల్యాగ్స్ తో సాగుతుందట. 

 

అయితే ప్రీ క్లైమాక్స్, అలానే క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం మంచి కథను ఎంచుకున్న దర్శకుడు మురుగదాస్, దానిని ప్రేక్షక నాడి పట్టుకునే విధంగా తీయడంలో కొంత తడబడ్డాడట. అయితే ఓవర్ ఆల్ గా మాత్రం ఈ సినిమా బాగుందని, ముఖ్యంగా రజిని ఫ్యాన్స్ సినిమాతో పూర్తిగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఇక గతంలో రజిని నటించిన కాల, కబాలి వంటి సినిమాలతో పోలిస్తే, ఈ దర్బార్ సినిమా, రజిని కెరీర్లో మంచి సినిమాగా నిలిచే అవకాశం ఉందని, ఫ్యాన్స్ తో పాటు మాస్, యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని అంటున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: