ఆదిత్య అరుణాచలం స్క్రీన్ ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నేడు పండుగ రోజు అనే చెప్పాలి. వారి ఆశల మేరకు రజిని, ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన దర్బార్ సినిమా, ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తుపాకీ, కత్తి వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఏ ఆర్ మురుగదాస్, ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్ గా నటించింది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను ప్రఖ్యాత తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. 

 

ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తెరకెక్కిన ఈ సినిమాలో రజిని తన మాస్ స్టైల్,  యాక్షన్ తో దుమ్ముదులిపాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతోంది. ఎన్‌కౌంట‌ర్ల ప‌రంగా ఎస్పీ స‌జ్జ‌నార్ స్టైల్‌ను పోలి ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలంగా నటించిన రజిని పాత్ర ఉంటుందట. చేతిలో గ‌న్ ఉంటే చాలు రూల్స్ పుస్త‌కాలు, మ‌న్నూ మ‌శానాలు అక్క‌ర్లేదు. అవ‌త‌ల త‌ప్పు చేసిన వాడు ఉంటే కాల్చి ప‌డేయ‌డ‌మే అన్న‌ట్టుగా ముర‌గ‌దాస్ ఈ కిచిడీ మూవీని వండేశాడు. తాను చేసే ఎన్‌కౌంట‌ర్ల‌ను ప్ర‌శ్నించే మాన‌వ‌హ‌క్కుల సంఘాల‌ను బెదిరిస్తే త‌న‌కు అనుకూలంగా రిపోర్టు వ‌చ్చేస్తుంది సింపుల్‌గా అనే పంథాలో సాగిన ఈ సినిమాలో రజిని మార్క్ 

 

యాక్షన్, ఫైట్స్, సీన్స్, స్టైల్, వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల గ్యాప్ తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా చూడాలి అనే కోరిక సాధారణ ప్రేక్షకుల్లో కూడా కలిగింది. అయితే దర్శకుడు మురుగదాస్ సినిమాను బాగానే తీసినప్పటికీ, తాము ఆశించిన రేంజ్ ని మాత్రమె అందుకోలేకపోయాడని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: