సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘దర్బార్’.  నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి పండ‌గ‌కు ముందుగానే బాక్సాఫీస్‌ బరిలో పందెంకోడిలా దూకింది.  డబ్బింగ్‌ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఆయన రేంజ్‌కు త‌గ్గ హిట్స్ లేవు. రోబో త‌ర్వాత రజినీ చాలా సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ హిట్ మాత్రం ద‌క్కలేదు. 

 

సినిమా విష‌యానికి వ‌స్తే.. రోటీన్ క‌థ‌గా తేలిపోయింది. వాస్త‌వానికి ఇలాంటి క‌థ‌లతో సినిమాలు మ‌న తెలుగులో ఎప్పుడో వ‌చ్చేశాయి. అస‌లు ఇలాంటి క‌థ‌ల‌తో మ‌న తెలుగు హీరోలు సినిమాలు  తీసి తీసి చేస్తేనే మ‌న‌వాళ్లు డిజాస్ట‌ర్లు ఇచ్చారు. అయితే ఈ క‌థ త‌మిళ్ వాళ్ల‌కు న‌చ్చుతుందేమో గాని మ‌న వాళ్ల‌కు అస్స‌లు ఎక్క‌దు. ఇక మురుగ‌దాస్ అంటే ఎన్నో ఆశ‌ల‌తో థియేట‌ర్ల‌కు వెళితే నిరుత్సాహ ప‌డాల్సిందే. ప్ర‌స్తుతం మ‌న వాళ్ల‌కు ఇలాంటి చెత్త క‌థ‌, క‌థ‌నాలు అస్స‌లు ఎక్కే ప‌రిస్థితి లేదు. ఏదో ర‌జ‌నీ సినిమా కాబ‌ట్టి ఒక‌సారి వెళ్లి వ‌స్తారంతే అన్న ప‌రిస్థ‌తి ఏర్పండి.

 

కాగా, ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో సునీల్ శెట్టి, నివేదా థామస్‌, ప్రతీక్ బబ్బర్‌లు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా రజనీ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్‌లో రజనీ స్టైల్స్‌ యాక్షన్‌ హైలెట్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: