దర్బార్.. ఈరోజు ట్రేండింగ్ ఇదే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. సినిమా సూపర్ డూపర్ అంటూ ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే అంతటి సినిమాలో రజినీకాంత్ కి సరితూగే తారలను తీసుకొచ్చి సినిమా మరింత సూపర్ హిట్ చేశారు.             

 

ఆ తారలు ఎవరు అంటే.. ఒకరు నయనతార.. మరోకరు నివేద థామస్. ఏమాట‌కు ఆ మాట నివేధా థామ‌స్ స్వ‌తహాగా మంచి న‌టి.. ఎంత మంచి నటి అంటే.. తెలుగులో మొదటి సినిమా జెంటిల్ మ్యాన్ లో నాని సరసన నటించి కొన్ని కోట్లమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి అని, ఎన్టీఆర్ సరసన జై లవకుశ అని ఇలా మంచి మంచి సినిమాలలో తనకంటూ ఓ మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది. అలానే ఈ దర్బార్ సినిమాలోనూ ఆమె ర‌జ‌నీ బిడ్డ‌గా అద‌ర‌గొట్టింది. 

 

తండ్రికి సాయం చేసేందుకు ఆయ‌న‌కు పెళ్లి చేసేందుకు.. తండ్రి న‌య‌న‌తార‌కు లైన్ వేసేందుకు ఆమె చేసే ప‌నులు హెల్ఫింగ్‌లు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి.. సైరా న‌య‌న‌తార పాత్ర‌కు ప్ర‌యార్టీ ఉంది.. ఈ సినిమాలో న‌య‌న‌తార పాత్ర‌కు కనీసం కూతురుకు ఉన్నంత ప్రాధాన్యం కూడా లేదు.. ఈ సినిమా చూస్తే ఫాఫం న‌య‌న్ అనుకోవాల్సిందే. ఏది ఏమైనా ప్రేక్షకులను అలరించిన ఈ దర్బార్ సినిమాకు దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించి సూపర్ డూపర్ హిట్ చేశారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి నిర్వహించారు. అనిరుధ్ అందించిన పాటలు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: