ఒకవైపు రోజురోజుకీ ‘అల వైకుంటపురములో’ మ్యానియా పెరిగి పోతుంటే ఈ మూవీ మేకర్స్ పై కొందరు కేసులు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. షాక్ ఇచ్చే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన  సందర్భంలో కొన్ని పొరపాట్లు జరిగాయి అంటూ కొందరు కేసులు వేసినట్లు తెలుస్తోంది. 

ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్న వార్తల ప్రకారం ఈ ఫంక్షన్ నిర్వాహణలో నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు టాక్. 'అల వైకుంఠపురములో' ఈవెంట్ నిర్వాహకులకు పోలీస్ లు ఇచ్చిన అనుమతికన్నా ఎక్కువ సమయం ఈ ఫంక్షన్ నిర్వహించడంతో పాటు వేలాదిగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడంలో ఈ ఈవెంట్ నిర్వాహకులు విఫలం అయినందుకు ఈ కేసులు పడినట్లు సమాచారం. 

దీనికితోడు అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమం రాత్రి 11:30 గంటలకు వరకు కొనసాగడంతో ఈ మేరకు కేసులు నమోదయ్యాయి అని తెలుస్తంది. అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఈ కేసులు నమోదు అయినట్లు టాక్.  

ఈ షో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల తొక్కిసలాట జరిగి ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలమందికి అసౌకర్యం కలిగిందని కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ సమయంలో విపరీతమైన టెన్షన్ లో ఉన్న ఈ మూవీ మేకర్స్ ఈ కేసుల వార్తలు విని తలపట్టుకుంటున్నట్లు టాక్. అయితే ఇలాంటి చిన్న విషయాల పై నమోదు కాబడే కేసులు ఫైన్ వేయడంతో పరిష్కారం అవుతాయి కాబట్టి ఈవిషయాల లపై దృష్టి పెడుతూనే ఈ మూవీ ప్రమోషన్ విషయంలో ఒక్క క్షణం ఎటువంటి తీరిక లేకుండా ఈ మూవీ యూనిట్ పరుగులు తీస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: