దర్బార్.. ఈరోజు ట్రేండింగ్ ఇదే.. ఎందుకంటే ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా. ఏడుపదులు వయసు వచ్చిన రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు.. ఇంత వయసు వచ్చిన సరే రజినీకాంత్ కూడా సినిమా కథలు ఎన్నుకునే సమయంలో తప్పు చేస్తున్నడే అనే భావన సినీ క్రిటిక్స్ కి ఇప్పటికి ఉంది. 

 

సరే.. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెడితే.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అని రజిని అభిమానులు అంటే.. మిగితావారు.. అంత లేదు.. మాములుగా ఉంది అని అంటున్నారు. ఎవరు ఏం అన్నకూడా.. సినిమా చుసిన మా బాస్ కూడా సినిమా క్లిమాక్సు చాల దారుణంగా ఉంది అని అన్నారు. మా బాస్ అనడమే కాదు లెండి.. సినిమా చుసిన ప్రేక్షకులు.. నేను కూడా అదే మాట అంటున్న. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ అంతలా ఉంది మరి..  

 

అది ఎలా అంటే.. ఫస్ట్ ఆఫ్ లో సినిమా ఆలా ఆలా సాగింది. బాగుంది రా అని అనిపించే సరి సెకండాఫ్ బోర్ కొట్టేసింది. అసలే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి సినిమా గ్రాఫ్ ప‌డిపోయింది. ర‌జ‌నీ అభిమానులు మిన‌హా మిగిలిన వాళ్లు అంద‌రూ సినిమాలో ఏమీ లేదు చివ‌ర‌కు క్లైమాక్స్ అయినా బాగుంటుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. మురుగ‌దాస్ అర్థంప‌ర్థం లేని క్లైమాక్స్‌తో ఆ చిన్న ఉత్సాహం కూడా నీరు గార్చేశాడు.

 

ర‌జ‌నీ విల‌న్ సునీల్‌శెట్టి ఎక్క‌డున్నాడో సింపుల్‌గా తెలుసుకుని అక్క‌డ‌కు వ‌చ్చి ఎటాక్ చేస్తాడు. పారిపోతున్ సునీల్‌శెట్టిని సీసీ కెమేరాలో చూస్తాడు. వెంట‌నే సునీల్‌శెట్టి నేను ఉన్న చోటుకు నువ్వు ఒక్క‌డివే రావాల‌ని స‌వాల్ విసురుతాడు. అక్క‌డ‌కు వెళ్లి సునీల్‌శెట్టి క‌త్తి విసిరి చంపేస్తాడు. ఎప్పుడో 1970వ ద‌శ‌కంలో చెత్త సినిమాల్లో చెత్త క్లైమాక్స్‌ను త‌ల‌పించేలా ద‌ర్బ‌ర్ క్లైమాక్స్ ఉంది. అస‌లే వీక్ క‌థ‌, వీక్ ట్రీట్మెంట్ అనుకుంటే వీక్ క్లైమాక్స్‌తో మ‌రింత విసిగించాడు. ఇంకా సినిమా చుసిన వాళ్లంతా ఏందయ్యా ఈ క్లైమాక్సు అంటూ ఫీల్ అయిపోయారు. మరికొందరు అయితే మురుగా ఏమీ క్లైమాక్సు తంబీ.. ? అంటూ తలలు పట్టుకొని బయటకు వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: