సూపర్ స్టార్ రజినీ కాంత్ పేరు పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్న హీరో.. 168 కి పైగా సినిమాల లో నటించారు ఘనత ఒక్క రజినీ కాంత్ కే సొంతం.. ఆయన కున్న క్రేజ్ వల్లే ఇన్ని రోజులు సినిమాల లో రాణిస్తున్నారు..అందుకే తెలుగు, తమిళ్ లో ఆయనకు అభిమానులు ఎక్కువే అని అందరికీ తెలిసిందే.. ఆయన సినిమా అంటే తమిళ - తెలుగు ప్రేక్షకులు ఎగబడతారు . తమిళ నాట ఎంతగా రజినీక్రేజ్ ఉందో అంతగా తెలుగు లో కూడా ఆయన సినిమా లు బాగానే ఆడతాయి.

 

 

దర్బార్ సినిమా గురించే సినిమా లోకం కొడై కూస్తోంది. దర్బార్ సినిమా కోసం రజిని ఎంత కష్టపడ్డారు , నయనతార తో సమానం గా ఎంగ్ గా ఉండడం కోసం రజినీకాంత్ చేసిన స్తంట్స్ దగ్గర నుంచి వ్యాయామం దాకా అన్నింటికీ సినిమా లో ఫలితం కనిపించింది. లుక్స్ విషయం లో రజిని కి తిరుగులేదు అని మరొక్కసారి ప్రూవ్ అయ్యింది. కథ మాత్రం మురుగదాస్ సరిగ్గా తీసుకోలేకపోయాడు అనీ అందుకే సినిమా పేలవంగా సాగింది అనే ఆరోపణ ఉంది. అయితే మరొక డిస్కషన్ కూడా సినిమా వాళ్ళ మధ్య నడుస్తోంది ..  ద‌ర్బార్ తొలి రోజు రిపోర్టుల ప్రకారం మొదటి భాగం సినిమా బాగున్నా రెండవ భాగంలో మాత్రం మురుగదాస్ తేలిపోయాడు.

 

 

ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా భారీగా జరిగినట్లు తెలుస్తోంది. హిందీలో 17 కోట్లు, తమిళనాడు థియేటిరికల్ 63 కోట్లు, ఇక తెలుగులో ఈ సినిమాకు 7.5 కోట్లు, కర్నాటకలో 7 కోట్లు, కేరళలో 5.5 కోట్లు, ఓవర్సీస్ చూసుకున్నట్టైతే 33 కోట్ల బిజినెస్ జరగగా, శాటిలైట్ సన్ టీవీ హక్కులు 33 కోట్లు, డిజిటల్ అమెజాన్‌లో 25 కోట్లు రాబట్టుకోగా, ఇక ఈ సినిమా ఆడియోకి 5 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. తెలుగులో కూడా రు.14 కోట్లు వ‌స్తేనే బ్రేక్ ఈవెన్ ఇది జ‌ర‌గ‌డం అసాధ్యంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: