సినిమాల మధ్య పోటీ, అభిమానుల మధ్య పోటీ గతంలో ఉండేది. ఇప్పుడు వీటికి మన హీరోలే చెక్ పెడుతున్నారు. తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. మిగిలిని సినిమాలు కూడా బాగా ఆడాలని, పరిశ్రమ బాగుండాలంటూ సహృద్భావ వాతావరణం కల్పిస్తున్నారు. 2017లో చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. బాలకృష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి, ఆర్ నారాయణమూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, శతమానం భవతీ సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకున్నాడు. బాలకృష్ణ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 

 

అప్పటినుంచీ మన ప్రెజంట్ జనరేషన్ హీరోలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇటివల చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ కూడా ఈ సంక్రాంతి సినిమాలు ఆడాలని కోరుకున్నారు. చిరంజీవి అయితే.. రజినీ దర్బార్ గురించి ‘నా ఫ్రెండ్ సినిమా’ అంటూ ప్రస్తావించాడు. కానీ అదే రజినీకాంత్ సైరా సినిమా తమిళ్ లో విడుదలైతే కనీసం ఓ ట్విట్టర్ మెసేజ్ కూడా చేయలేదు. బహిరంగంగా ఎక్కడా చిరంజీవి గురించి ప్రస్తావించలేదు. రీసెంట్ గా దర్బార్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ కూడా.. ఎక్కడా సంక్రాంతి సినిమాలు ఆడాలని చిరంజీవి కోరుకున్నట్టు పెద్ద మనిషి తరహాలో కోరుకోలేదు కూడా. కానీ మన తెలుగు హీరోలు మాత్రం రజినీకాంత్ సినిమా ఆడాలని బహిరంగంగా ప్రకటించారు.

 

 

అల్లు అర్జున్ అయితే.. ‘చిరంజీవి తర్వాత నాకు రజినీకాంత్ అంటే ఇష్టం. ఆయన సినిమా ఆడాలి’ అన్నాడు. కానీ రజినీ హైదరాబాద్ వచ్చి కూడా పెద్దరికంతో మన తెలుగు సినిమాల ప్రస్తావన తేలేదు. పైగా బన్నీ, ఎన్టీఆర్ లా మహేశ్ మిగిలిన సినిమాల గురించి ప్రస్తావించలేదని నెటిజన్లు మండిపడడం విడ్డూరమే అని చెప్పాలి. వాస్తవాల్ని మరచి మనవాళ్లందరూ రజినీ భజన చేయడం తగదని తెలుగు ప్రేక్షకులు నుంచి విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: