తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్... ఈ పేరుకు సినీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్  ఉంది.  ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ఈ  హీరో సినిమాలు  భారీ విజయాలను నమోదు చేస్తూ ఉంటాయి. అందరూ ప్రేక్షకులు రజినీ సినిమా వస్తుందంటే ఎక్కువ అంచనాలతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రజనీకాంత్ కు ఎంత క్రేజ్ ఉన్నపటికీ గత ఐదారేళ్ల నుంచి సరైన హిట్ మాత్రం పడలేదు. హిట్ కాంబినేషన్ అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన రోబో 2.0 కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎంత భారీ బడ్జెట్ ఐతేనేమి కథలో అసలు సిసలైన బలం ఉండాలి అని  ప్రేక్షకులు భావించారు. ఎకంగా విలన్ గా  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో తీసుకొచ్చినప్పటికీ  కూడా రోబో 2.0  సినిమా విషయంలో వర్కౌట్ కాలేదు. 

 

 

 ఆ తర్వాత పేట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే వసూళ్ళ పరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ.. టాక్ పరంగా మాత్రం రజిని సినిమాలు ఫ్లాప్ గానే  మిగిలిపోతున్నాయి. అయితే దీనికి కారణం రజనీకాంత్ సినిమా కథలపైన ఎక్కువగా జాగ్రత్త పడటం లేదు అనే టాక్ వినిపిస్తోంది. సినిమా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండక పోవడం వల్ల గత ఐదు ఆరు వేల నుంచి సరైన హిట్ కొట్టలేకపోయింది ఉన్నారని ప్రేక్షకులు అనుకుంటున్న మాట. అంతేకాకుండా రజనీకి స్టైల్ కు పెట్టింది పేరు అనే విషయం తెలుస్తుంది. కేవలం రజనీ స్టైల్ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. 

 

 

 అయితే కేవలం స్టైల్ ఒక్కటే సినిమాను చేయలేదు కదా   కథలో బలం కూడా ఉండాలి సరైన కథాంశం కూడా ఉండాలి దానిని సరిగ్గా తెరకెక్కించే దర్శకుడు కూడా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా హిట్ అవుతుంది. అయితే గత అయిదారు సంవత్సరాల నుంచి ఈ రజిని కేవలం ఆయన స్టైల్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తాజాగా దర్బార్ సినిమా విషయంలో కూడా కేవలం రజిని స్టైల్ పైన దృష్టి పెట్టాడు దర్శకుడు కూడా.  ఆయన నడక మేనరిజం డైలాగ్ డెలివరీ... ఇలాంటి వాటి మీద ఎక్కువగా రజినీకాంత్ దృష్టి పెడుతున్నారు.దర్బార్  సినిమాలో  ఇవన్నీ మెండుగానే ఉన్నాయి తప్ప కథను బలం మాత్రం ఉండడం లేదు. స్టోరీ లో బలం లేకపోవడం సినిమాల్లోని పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే రజిని హిట్ కాలేక పోతున్నారని అనుకుంటున్నారూ. రజనీకాంత్ స్టైల్ ఒక్కటే సినిమాకు హిట్ అవ్వదు అని తెలుసుకో ప్లీజ్ అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: