సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్‌ ఏఆర్‌ ముగరుదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దర్బార్‌. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. తలైవాను వింటేజ్‌ లుక్‌లో చూపించిన మురుగదాస్‌ టీజర్‌, ట్రైలర్‌లతోనే సినిమా మీద అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్లాడు. ఇక  డబ్బింగ్‌ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. 

 

రజినీ మరియు మురుగదాస్ ల కాంబో తెరకెక్కిన మొట్టమొదటి స్టైలిష్ కాప్ డ్రామా  దర్భార్.. సంక్రాంతి పండ‌గకు ముందుగానే నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆదిత్య ఆరుణాచ‌లంగా ర‌జ‌నీ యాక్టింగ్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. అలాగే సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఓ రేంజ్‌లో న‌డించింద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. అనిరుధ్ స్వ‌త‌హాగా మంచి మ్యూజిక్ ఇస్తాడు. పేట సినిమాకు కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఇక ద‌ర్బార్‌కు కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడ‌ని అంద‌రూ ఆశించారు. అయితే సినిమా చూస్తుంటే ద‌ర్బార్ సినిమాలో అన్ని సీన్ల‌కు ఒకే విధ‌మైన ఫార్మాట్‌లో వెళ్లిపోయాడు. సంగీతంలో లౌడ్ ఎక్కువైంది.

 

బాగా సౌండ్ వినిపిస్తుందే త‌ప్పా సీన్ల‌కు త‌గిన‌ట్టుగా లేదు. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ల‌లో మ్యూజిక్ బాగానే ఉన్నా.. విషాదం, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మాత్రం సంగీతం బాగా తేలిపోయింది. అలాంటి సీన్ల‌లో కూడా బిగ్గ‌ర‌గా శ‌బ్దాలు, లౌడ్ ఎందుకు పెట్టాడో ఎవ్వ‌రికి అర్థం కాదు. కేవ‌లం హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ల వ‌ర‌కు మెప్పించినా.. సినిమా మిగిలిన సీన్ల‌లో మాత్రం ప్రేక్ష‌కుడిని క‌నెక్ట్ చేయ‌డంలో ఫెయిట్ అయ్యింది. ఓవ‌ర్ ఆల్‌గా చెప్పాలంటే.. అన్నిటికి ఒకే లౌడ్‌తో లాగించేశాడు. కాగా, ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్నానికి పాసిటివ్ టాక్ వ‌చ్చింది. హీరో ర‌జినీకాంత్ సినిమా వ‌న్ మ్యాన్ షోగా న‌డిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: