తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దర్బార్. ఈ చిత్రం మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. సక్సెస్ఫుల్ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో ఇప్పటికే రజినీకి హిట్ సినిమాలు ఉండటంతో దర్బార్ సినిమా కూడా భారీ హిట్ అవ్వడం ఖాయమని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతుండటంతో దర్బార్  సినిమాపై ప్రేక్షకుల్లో హైప్  మరింత పెరిగిపోయింది. ఇక పోతే నేడు  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రతిచోట మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా లో రజనీకాంత్ తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

 

 

 గత కొంతకాలంగా రజినీకాంత్ వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు.  దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు రజినీకాంత్ అటు అభిమానులు కూడా ఈ సినిమా విజయంపై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులతో పాటు రజినీకాంత్ నమ్మకం కూడా దర్బార్  సినిమా మంచి విజయం వైపు దూసుకుపోతున్నాడు. ఇక రజనీ స్టైల్ యాక్టింగ్ రజిని యాక్షన్ మరోసారి దర్బార్ సినిమాలో 100% కనిపించింది. దీంతో ఈ సినిమా చూడడానికి వెళ్లిన ప్రేక్షకులందరూ సినిమా హాల్లో ఈలలు,  గోలలతో  హోరెత్తిపోతున్నాయి  సినిమా థియేటర్లు. కాగా ఈ సినిమా మొత్తం రజనీకాంత్ వన్ మ్యాన్ షోగా  ముందుకు నడిపించారు. 

 

 

 ఈ సినిమాలో పాత్రలు ఎన్ని ఉన్నప్పటికీ సినిమా మొదలుకొని చివరి వరకు కేవలం రజినీకాంత్ మాత్రమే కనిపిస్తాడు ప్రేక్షకులకు. దర్బార్ అంటే రజిని మార్క్ స్టైల్ సినిమా అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాను మురుగదాస్ దర్శకత్వం వహించారు అనడం కంటే రజినీకాంత్ అన్ని తానై  సినిమాలో నటించారు అని అనడం బెటర్. మురుగదాస్ దర్శకత్వం  కంటే కేవలం రజిని స్టైల్  యాక్షన్ సినిమా మొత్తం కనిపిస్తుంది . అసలు దర్బార్ సినిమాలో మురుగదాస్ ప్రతిభ కష్టం కొంచెం కూడా లేదు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. దర్శకుడు పేరు వేయడం కూడా వేస్ట్ అని... దర్శకుడు ప్లేస్ లో కూడా రజినీకాంత్ పేరు వేస్తే సరిపోతుంది అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమాలో మొత్తం తమిళ వాసనలు తుపాకుల పెట్టి కాల్చుకోవడం రజిని  స్టైల్ మాత్రమే ఉందని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: