కన్న తల్లి అంటే కన్న బిడ్డకు ఎటువంటి కష్టం వచ్చిన కూడా తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య కన్న తల్ల కసాయి తల్లులు గా మారరాన్నై సంగతి తెలిసిందే.. అయితే ఇక్కడ కొంచం విచిత్రంగా జరిగింది.. శీతాకాలం లో బిడ్డల కోసం తల్లి ఎంతో కష్టపడతారు అన్న విషయం వారికే తెలుసు.ఇక్కడ మాత్రం  రివర్స్ జరిగింది.


చలికాలం లో పసిబిడ్డల ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే.. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా లో అతి త్వరగా సోకి అనారోగ్యాని కి గురయ్యే ప్రమాదం ఉంది. కానీ, ఆ తల్లి.. తన బిడ్డను ఏకంగా చలిలో వదిలిపెట్టి చంపేసింది. ఆమె మతిమరపు వల్ల ఆ బిడ్డ మైనస్ 20 డిగ్రీల చలిలో నరకయాతన అనుభవించాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

 

వివరాల్లోకి వెళితే.. రష్యా లో ఖబరోవ్స్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల మహిళ తన ఏడు నెలల పసిబిడ్డకు కాస్త తాజా గాలి తగులుతుందనే ఉద్దేశం తో బగ్గీ‌లో పడుకోబెట్టి బాల్కానీ లో వదిలిపెట్టింది. ఆ తర్వాత ఇంటి పనుల్లో మునిగి బిడ్డను మరిచిపోయింది. ఇంట్లోనే ఉయ్యాలలో నే ఉందనుకుని బిడ్డను పట్టించుకోలేదు. అలా ఆ బిడ్డను పూర్తిగా మరిచిపోయింది. 

 


ఇక దాదాపు 5 గంటలయ్యాక వచ్చి చుస్తే ఆ బిడ్డ 20 డిగ్రీల చలిలో గడ్డ కట్టుకొని పోయాడు.  బాల్కానీలో ఉన్న బిడ్డ పరిస్థితి చూసి షాకైంది. శ్వాస నిలిచిపోయి గడ్డకట్టేశాడు. వెంటనే హాస్పిటల్‌ కు తీసుకెళ్లి నా.. ఫలితం దక్కలేదు. ఆ బిడ్డ అప్పటికే తుదిశ్వాస విడిచాడు. దీంతో పోలీసులు బాధ్యతరాహిత్యం గా వ్యవహరించిన తల్లి ని అరెస్టు చేశారు. అలా బిడ్డను మర్చిపోయి జైలు పాలైయింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: