తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్  పేరు పరిచయం అక్కర్లేని పేరు..ఆరుపదుల వయస్సులో రజిని కాంత్ చేసే సాహసాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్న వచ్చిన రోబో నుండి నిన్న వచ్చిన పేట వరకు రజిని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఏదిఏమైనా కూడా ప్రస్తుతం రజిని కాంత్ నటించిన చిత్రం దర్బార్.. ఈ సినిమాలో నయనతార రజిని సరసన నటించింది. ఈ సినిమాలో తలైవా రజిని కాంత్ పోలీస్ పాత్రలో  నటించారు. రచ్చ లేపిన ట్రైలర్ భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా తాజాగా విడుదలయింది. 

 

మురుగ‌దాస్ మళ్ళీ  అదే ఫార్ములా ను ఉపయోగించాడు.స్టైల్ రేసీ స్క్రీన్ ప్లే ర‌జ‌నీ వ‌న్ మ్యాన్ షో ర‌జ‌నీ యంగ్‌గా క‌నిపించ‌డం అందరికి సంతోషాన్ని కలిగించింది... కాప్ స్టోరీ ఫ‌స్టాఫ్ హైలెట్స్‌...స్టోరీ మామూలుగానే ఉన్నా.. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, ర‌జ‌నీ న‌ట‌న ఫ‌స్టాఫ్ హైలెట్స్ తుపాకీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఎలా త‌న స్క్రీన్ ప్లేతో మ్య‌జిక్ చేశాడో ఇక్క‌డ కూడా అదే చేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మ‌రి సెకండాఫ్ ఎలా ఉంటుందో ?  చూడాలి అని ప్రేక్షకులను ఆలోచింప చేస్తుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అని అర్థమవుతుంది. 

 

విషయానికొస్తే పాత కథనే రీ మాడ్యూల్ చేశారట. అదే పాత క‌థ‌, పాత స్టైలే, పాత ఎమోష‌నే, పాత ట్రీట్మెంటే;  పాత డ్యాన్సే, ప‌రమ రోటీనే అంతా రొటీన్ రొటీనే అంత‌కు మించి గతంలో  ఎన్ని చేసిన అదే ఇప్పుడు  ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాయే..అని కొందరు సినిమా పెద్దలు అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ బాగా ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ నత్తనడకలాగా సాగడంతో సినిమా పై అంచనాలు కొంచం తగ్గిందని వార్తలు వినపడుతున్నాయి. 


గతంలో వచ్చిన సినిమా పేట.. ఈ సినిమాలో శ్రేయ నటించిన కూడా యూత్ ను ఆకట్టుకోలేక పోవడంతో సినిమా రెండో రోజుకే బయటకొచ్చింది. అందుకే ఈ సినిమా కథను మరో విదంగా దర్బారు లో చూపించారట. తమిళ తలైవా ప్రేక్షకులకు తప్ప మరెవ్వరికీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏది ఏమైనా కూడా రజిని ఈ వయసులో కూడా ఇలా ఫీట్లు చేయడం గమనార్హం అని సదరు అభిప్రాయపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: